ASBL NSL Infratech

జగన్ బహిరంగ సభలు.. మ్యాజిక్ మేనిఫెస్టోకి ముహూర్తం ఫిక్స్..

జగన్ బహిరంగ సభలు.. మ్యాజిక్ మేనిఫెస్టోకి ముహూర్తం ఫిక్స్..

రాబోయే ఎన్నికల కోసం ప్రతి పార్టీ తమ వంతు ఎత్తును వేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రూలింగ్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అస్త్రానికి ముహూర్తం రెడీ చేసుకున్నట్లు టాక్. ఈనెల 15వ తేదీ నుంచి వరుసగా జిల్లాల వారీగా పర్యటన జోరు పెంచుతున్న జగన్ ప్రత్యేకంగా రాయలసీమపై తన దృష్టి కేంద్రీకృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం, రాయచోటి, రాప్తాడు, కర్నూలు జిల్లాలలో విస్తృతంగా పర్యటించే విధంగా ఆయన తన ప్రణాళికను రూపొందిస్తున్నారు.

పర్యటనలో భాగంగా ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లాలోని రాప్తాడు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మేనిఫెస్టోను విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారట. అందుకోసమే రాప్తాడు లో జరగబోతున్న బహిరంగ సభను వైసిపి ఎంతో ప్రెస్టీజియస్ గా భావిస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 52 నియోజకవర్గాలలో 49 ని వైయస్సార్ కైవసం చేసుకుంది. అందుకే ఈసారి మొత్తం 52 నియోజకవర్గాలు తమ ఖాతాలో వేసుకోవడమే టార్గెట్గా పావులను కదుపుతోంది ఈ పార్టీ.

ఈ నేపథ్యంలో అవసరమైన మేరకు సర్వేలు చేయిస్తూ.. రాయలసీమలోని కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూరు జిల్లాలపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాడు జగన్. ఈనెల 16వ తేదీన కుప్పంలో కూడా ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో వైయస్సార్ చేయూత స్కీం కింద నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత 21న రాయచోటిలో జరిగే బహిరంగ సభలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేస్తారు. ఇక కర్నూల్లో 24 వ తారీకున జరిగే బహిరంగ సభలో ఈ బీసీ నేస్తం కింద మూడవ విడత నిధులను జమ చేస్తారు. ఆ తర్వాత 27.. అమరావతి జిల్లా గుంటూరులో విద్యా దీవెన నాల్గవ విడత నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేయబోతున్నారు. మార్చి 5న జరిగే అనంతపూర్.. పుట్టపర్తి బహిరంగ సభలో వసతి దీవెన రెండవ విడత నిధులను విద్యార్థులకు అందిస్తారు.

భారీ సభలను నిర్వహించడంతోపాటు.. విద్యార్థులు, రైతులు, మహిళలో.. ఓటింగ్ కు ప్రధానమైన ఈ మూడు సెక్షన్లను కవర్ చేస్తున్నాడు జగన్. మేనిఫెస్టో మడత విప్పకుండానే పథకాలతో ఇప్పటికే ప్రతిపక్షాలకు టెన్షన్ పుట్టిస్తున్న జగన్ ఇక మేనిఫెస్టోలో ఎటువంటి స్కీములు పొందిపరిచాడు వేచి చూడాలి. మొత్తానికి 175 సీట్లు గెలవాలి అని పట్టుదలగా ప్రణాళికలు రెడీ అయితే చేస్తున్నాడు.. మరి అతని పాచిక ఈసారి ఎంతవరకు పారుతుందో ప్రజలే నిర్ణయించాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :