జగన్ మాస్టర్ మైండ్ మేనిఫెస్టో.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతున్న ప్రతిపక్షాలు..
ఎన్నికలు వస్తున్నాయి అంటేనే హామీల పర్వం మొదలవుతుంది అని అర్థం .ఐదేళ్ల పాలనలో మౌనం వహించిన పెద్దలందరూ చైతన్యవంతులైది ఈ టైంలోనే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షాల దాడి ఒకవైపు అయితే ..కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిలక్క పోరు మరొకవైపు వైఎస్ఆర్సిపిని సతాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలలో తమ విజయం కోసం సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు జగన్. ఎన్నికలు గతి మార్చే శక్తి కలిగిన మేనిఫెస్టో పై నమ్మకంతో దాన్ని ప్రత్యర్థులపై బ్రహ్మాస్కంగా వాడబోతున్నాడు.
గతంలో కూడా జగన్ ఎన్నికల ముందు తన మానిఫెస్టో మాయాజాలంతో ప్రజలను మైమరిపించాడు. ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. నవరత్నాలు అని ..రకరకాల స్కీములతో ..స్కాములను మరిపించి కుర్చీ ఎక్కిన జగన్. ఈసారి ప్రజల కోసం ఎలాంటి స్కీమ్స్ తన మేనిఫెస్టోలో పొందిపరచాడు తెలుసా..? 2019లో తమ పార్టీని విజయం వైపు నడిపించిన నవరత్నాలను మించిన హామీలతో జగన్ జనం ముందుకు వస్తున్నాడు. మరి దీనికి ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఈసారి జగన్ ప్రభుత్వం ఇవ్వబోయే హామీలు ప్రధానంగా మూడు వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉండబోతున్నాయి. దేశానికి వెన్నెముకగా వ్యవహరించే రైతుల విషయంలో ఈసారి జగన్ రుణమాఫీ ప్రకటన చేసే అవకాశం ఉందట. ఆంధ్ర రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల వరకు రైతులు ఉన్నారు. అంటే నాలుగు కోట్ల ఓటర్ల జాబితాలో 18% రైతులు ఉన్నారన్నమాట. అందుకే వీళ్లను తన వైపు తెప్పించడం కోసం రుణమాఫీ హామీని ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వాడబోతున్నారు. ఇక ఓటర్ల జాబితాలో మహిళల హవా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈసారి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమాన్ని మరింత చేసే విధంగా కొన్ని పథకాలు ప్రకటించబోతున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు కొన్ని కీలక హామీలు కూడా ఇచ్చే ఉద్దేశం ఉంది అని టాక్.
దీనితోపాటుగా సామాజిక పెన్షన్ తీసుకునే వర్గాలు కూడా ఎక్కువనే చెప్పాలి. ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య సుమారు 70 లక్షల వరకు ఉంది. కాబట్టి ఈసారి ఈ సామాజిక పెన్షన్ ఏకంగా నాలుగువేల రూపాయలు చేసి విడతల వారీగా పెంచుతామని చెప్పే అవకాశం ఉంది. వీళ్లతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో కొన్ని హామీలు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈసారి జగన్ చాలా పెద్ద మేనిఫెస్టో ప్రత్యర్ధులపై దాడికి సిద్ధమవుతున్నాడు.