తపసిపుడిలో సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. 2.2 కిలోమీటర్లు పొడవైన పోర్టు బ్యాక్ వాటర్స్ పనులకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, జోగి రమేశ్, స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని, విప్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags :