ASBL NSL Infratech

అమెరికాలో ఏపీ వాసి గీతాంజలి మృతి

అమెరికాలో  ఏపీ వాసి గీతాంజలి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పెనుగంచిప్రోలు మండలంలో కొణకంచి గ్రామానికి చెందిన కమతం గీతాంజలి (30) మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గీతాంజలి పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలో ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక ( 6) అక్కడికక్కడే మృతి చెందగా, గీతాంజలి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కొణకంచిలో విషాద వాతావరణం నెలకొంది. గీతాంజలి భర్త నరేష్‌, కుమారుడు సురక్షితంగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :