ASBL NSL Infratech

ఎన్నికల భరిలో వారసులు.. అభిమన్యులుగా మిగిలిపోతారా.. లేక అర్జునులుగా గెలుస్తారా..

ఎన్నికల భరిలో వారసులు.. అభిమన్యులుగా మిగిలిపోతారా.. లేక అర్జునులుగా గెలుస్తారా..

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీల నుంచి పోటీ చేస్తున్న రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలను తెస్తారు అన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. విజయం సాధిస్తారా.. లేక ఓటమితో వెను తిరుగుతారా అన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. యువతకు, విద్యాధికులను అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఎందరో యువతకు ఈసారి అవకాశం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి వీరు గెలుస్తారా లేదా అన్న విషయం సర్వత్ర ఆసక్తిగా మారింది.

అధికార పార్టీ తరఫున తిరుపతి నియోజకవర్గం నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కూతురు ఫాతిమా.. వారసులుగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గాలలో ఫలితాలు జగన్ ఆశించిన విధంగా లేవు అన్న టాక్ వినిపిస్తోంది.

ఇక టిడిపి తరఫున వెంకటగిరి నుంచి కుర్లకొండ రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రియా, కాళహస్తి నుంచి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి, కమలాపురం నుండి పుత్తా నరసింహారెడ్డి కొడుకు చైతన్య రెడ్డి, పుట్టపర్తి నుండి పల్లె రఘునాధ రెడ్డి కోడలు సింధూర రెడ్డి వారసులుగా బరిలోకి దిగుతున్నారు. అలాగే కోవూరు నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి, ప్రత్తిపాడు నుండి దివంగత నేత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ, కదిరి నుంచి కందికుంట ప్రసాద్ సతీమణి యశోదా దేవి ఈసారి ఎన్నికల్లో నిలబడుతున్నారు. అయితే ఈ ప్రయోగాలు ఎంతవరకు విజయాన్ని సాధిస్తాయి అన్న విషయం పై ఇప్పటివరకు స్పష్టత లేదు. కొన్ని ప్రదేశాలలో సానుకూలత ఉంటే మరికొన్ని ప్రదేశాలలో కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :