కడపలో వైసిపి కల్లోలం.. సాలిడ్ గా బరిలోకి దిగుతున్న తెలుగుదేశం..
సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా.. తరతరాలుగా వైయస్ కుటుంబానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జిల్లా.. అదేనండి కడప జిల్లా. దివంగత నేత.. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కడప జిల్లా సెగ్మెంట్లో వైయస్సార్ కుటుంబానికి ఎదురు అనేది లేకుండా పోయింది. ఒకరకంగా అది వారి కంచుకోట అనొచ్చు. అపజయం అనేది లేకుండా ముందుకు సాగుతున్న వైసీపీకి సొంత ఏరియాలోని ఈసారి విజయం కష్టం అనిపిస్తుంది.
కడప నుంచి వరుసగా ఇప్పటికీ రెండు సార్లు గెలిచిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పై ప్రస్తుతం వైసీపీలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతుంది. కేవలం వైయస్ కుటుంబం పై ఉన్న అభిమానం, గౌరవంతో పార్టీ విజయానికి సహకరించిన కడప జిల్లా కార్పొరేటర్లు.. ఈసారి డిప్యూటీ పై ఏర్పడిన తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఎంతవరకు సహకరిస్తారో డౌటే. ఈ విషయం ప్రస్తుతం వైసీపీ శ్రేణులలో కలకలం కూడా రేపుతోంది.. ఒకప్పుడు టిడిపి ఆ తర్వాత కాంగ్రెస్ కొంతకాలం అక్కడ నుంచి గెలిచినా.. క్రమంగా ఆ ఏరియాకు వైయస్ బ్రాండ్ పడిపోయింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అండదండలతో 2004, 2009 ఎన్నికల్లో అహ్మదుల్లా అక్కడి నుంచి రెండుసార్లు గెలిచాడు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన జగన్ పార్టీలోకి రాకుండా కాంగ్రెస్ లోనే కొనసాగాడు. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఉన్న అంజాద్ బాషా.. వైసిపి తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నాడు. మూడోసారి కూడా విజయ బావుటా ఎగురవేయాలి అనే అతని ఆలోచనలకు టీడీపీ చెక్ పెట్టబోతోంది.
ఈసారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవాలి అని ఫిక్స్ అయిన టిడిపి.. బలమైన ప్రత్యర్థిని ముఖ్యమైన ప్రదేశాల్లో దింపడానికి ఫిక్స్ అయిపోయింది. అందుకే ఈసారి టిడిపి కడపలో దించబోయే కొట్టడం అంజాద్ భాషా తరం కాదు అన్న టాక్ వినిపిస్తుంది. సొంత గడపలోనే జగన్ కు షాక్ ఇవ్వడం కోసం బాబు బలే స్కెచ్ వేశాడు. కడప జిల్లా టిడిపిలో కీలకమైన బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి.. భార్య రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఇప్పటికే గడప గడపకు వెళ్లి అంజాద్ భాషను ఉతికారేస్తుంది. బలమైన రాజకీయ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి.. అందుకే మాట్లాడుతూ ప్రజలను సునాయాసంగా తన వైపుకు తిప్పుకోగలుగుతుంది. శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు.. కడప జిల్లాలో ఈయన పేరు మీద పెద్ద ఆర్మీ నే ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈసారి కడప లో ఎన్నికల లెక్కలు వైసిపి పునాదులు కదిలిచ్చేలా ఉన్నాయి.