Radha Spaces ASBL

‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం లక్కీగా ఫీల్ అవుతున్నాను - ఆషికా రంగనాథ్

‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం లక్కీగా ఫీల్ అవుతున్నాను - ఆషికా రంగనాథ్

టాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌కి వ‌ర్క్ ఎన్విరాన్‌మెంట్ పరంగా పెద్ద‌గా తేడా లేదు. భాష మాత్ర‌మే వ్య‌త్యాసం. అయితే తెలుగులో మాత్రం ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేస్తారు. మంచి ప్లానింగ్‌తో ముందు కెళ‌తారు’’ అని అంటున్నారు హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్‌. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ తెలుగులో న‌టిస్తోన్న తొలి చిత్రం ‘అమిగోస్’. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించారు.  రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అమిగోస్ సినిమా జ‌ర్నీ ఎలా మొద‌లైంద‌నే విష‌యంతో పాటు ఆమె వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను వివ‌రించారు. ఆషికా రంగ‌నాథ్ మాట్లాడుతూ...

* చిన్న‌ప్పట్నుంచి తెలుగు సినిమాలు, పాట‌లు వినేదాన్ని దాని వ‌ల్ల తెలుగు అర్థ‌మ‌య్యేది. ఇప్పుడు వ‌ర్క్ చేస్తున్నాను. దాని వ‌ల్ల నేర్చుకోవ‌టానికి అవ‌కాశం వ‌చ్చింది. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సినిమాలో డైలాగులు చెప్పడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నాను.

*  తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ఇన్నాళ్లు ఎందుకు తీసుకున్నారు మీరు ఎప్పటినుంచో నటిస్తున్నారు. ఈ ప్రశ్న మీరు ఇక్కడున్న దర్శకుడుని అడగాలి ఎందుకు ఆ అమ్మాయిని కూడా తీసుకురావడానికి అన్ని రోజులు పట్టింది అని నిజానికి నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫీసు వచ్చాయి అయితే ఆ సమయంలో నాకు కాల్చి అడ్జస్ట్ కాకపోవడం ఇలాంటి విషయాలన్నీటి వలన నేను తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమైంది.

* ‘అమిగోస్’ సినిమా కోసం ముందు ఇంకో హీరోయిన్ ని తీసుకున్నామని చెప్పారు కానీ నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఫోన్ చేశారు. సినిమా గురించి చెప్పారు. ఎందుకు వాళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకున్నామని చెప్పారే అని అన్నాను. దానికి తను ఆ వివ‌రాలు తెలియ‌వు అన్నారు. అప్పుడు నేను డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డిగారు చెప్పిన క‌థ‌ను ఫోన్‌లోనే విన్నాను.  సినిమాలో హీరో మూడు పాత్ర‌లు చేయ‌టం.. నా పాత్ర‌ను మ‌లిచిన తీరు అన్ని న‌చ్చ‌డంతో సినిమాకు ఓకే చెప్పేశాను. అలా ఈ ప్రాజెక్టు ఓకే అయింది.

* నేను కళ్యాణ్ రామ్ గారిని ఫస్ట్ ‘అమిగోస్’  సెట్ లోనే చూసాను ‘హాయ్ నేను కళ్యాణ్’ అన్నారు. ‘హాయ్ నేను ఆషిక’ అన్నాను. అలా మా పరిచయం జరిగింది. స్టార్టింగ్‌లో మేమిద్దరం పెద్దగా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఇద్దరు సైలెంట్ గా ఉండే వ్యక్తులు కానీ రోజులు గడుస్తున్న కొద్ది సెట్లో నాకు తెలుగు డైలాగ్స్ విషయంలో కళ్యాణ్రామ్ చాలా సాయం చేశారు. డైలాగ్స్ ఎలా పలకాలి అలాంటిది నేర్చుకున్నాను అలా నాకు ఎంత మంచి నటుడితో పని చేస్తున్నాను అర్థమైంది. కళ్యాణ్ రామ్ చాలా కూల్ పర్సన్ ఆయనకి చాలా విషయాలు మీద ఎక్కువ అవగాహన ఉంది అలాంటి ఒక లెజెండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ఈ సినిమాలో ఆయన మూడు పాత్రలో నటించారు ప్రతి పాత్రకు ఆయన చేసిన కృషి నేను కళ్ళారా చూశాను ఎవరో ఏంటో చెప్పకుండానే ఏ క్యారెక్టర్ లేదు చెప్పగలిగినంత వేరియేషన్ చూపించారు. ఆయన డెడికేషన్ చూసి ఫిదా అయ్యాను.

* నిన్న ‘అమిగోస్’ సినిమాలోని సాంగ్ డ్రీమ్స్ రిలీజ్ అయినప్పుడు చాలామంది వెల్‌క‌మ్‌ టు టాలీవుడ్ అని మెసేజ్ పెట్టారు.  ఇక్కడ కొత్త వారిని చాలా బాగా ఆదరిస్తారని పేరు ఉంది. దాన్ని నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేశాను.

* తెలుగు సినిమాల్లో ఫస్ట్ నుంచి పబ్లిసిటీ చాలా బాగా చేస్తారు అనే పేరుంది లా విష్ గా సినిమా తీస్తారు అనే పేరు ఉంది కన్నడ ఇండస్ట్రీలో కూడా పబ్లిసిటీ బాగా చేస్తారు కానీ తెలుగుతో పోలిస్తే ఇంతకుముందు అక్కడ అంతగా ఉండేది కాదు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు.

* క‌న్న‌డ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 10-12 సినిమాలు చేశాను. త‌మిళంలో ఓ సినిమా చేశాను. ‘అమిగోస్’ చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టాను. న‌టిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాలి. అలాగే ప‌లు భాష‌ల్లోనూ న‌టించాలి.

* తెలుగులో ఇత‌ర సినిమాల్లో న‌టించ‌మ‌ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే ‘అమిగోస్’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. దీని త‌ర్వాత మంచి పాత్ర‌ల‌నిపించిన సినిమాల్లో న‌టిస్తాను.

* తెలుగు ఆడియెన్స్ గొప్ప మ‌న‌సున్నవారు. ఇక్కడ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులు చాలా మంది రాణిస్తున్నారు. హీరోయిన్సే కాదు.. కిచ్చా సుదీప్‌, ధ‌నంజ‌య్‌, దునియా విజ‌య్, య‌ష్‌.. స‌హా చాలా మందిని తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా అలాగే ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో ఎదురు చూస్తున్నాను.

* న‌టిగా మంచి రోల్ చేయ‌ట‌మే కాదు.. మంచి ప్రొడక్షన్ హౌస్‌, హీరో ఉన్న సినిమాలో యాక్ట్ చేస్తే మంచి ఎంట్రీ అవుతుంది. నాకు అమిగోస్ సినిమాతో అవ‌న్నీ చ‌క్క‌గా కుదిరాయ‌నిపిస్తుంది. దీంతో ఈ సినిమా నాకు క‌రెక్ట్ ఎంట్రీ అనిపిస్తుంది.

* బాల‌కృష్ణ‌గారు చేసిన ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వంటి ఐకానిక్ సాంగ్‌లో న‌టించ‌టం ల‌క్కీగా ఫీల్ అవుతున్నాను. ఈజీగా ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతాన‌నిపించింది. క‌చ్చితంగా నారోల్ అంద‌రికీ న‌చ్చుతుంది.

 

Click here for Yashika Ranganath Stills

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :