చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని యాగం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి యార్లగడ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. మూడు రోజుల పాటు కానురులోని యార్లగడ్డ గ్రాండియర్‌లో ఈ యాగం ఏర్పాటు చేశారు. నేపాల్‌కు చెందిన రుత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.







Tags :