ఆఫ్రికాలో డబ్ల్యూటీఐటీసీ సమ్మిట్
తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ, పరిశ్రమల రంగాలకు చెందిన సంస్థలు విదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) ఈ నెల 18న ఆఫ్రికాలో సమ్మిట్‌ను నిర్వహించబోతున్నది. ఇందుకు సంబంధించిన లోగోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూటీఐటీసీ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. టెక్నాలజీ ఎక్స్ఛేంజ్‌తో పాటు వ్యాపార విస్తరణకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని వివరించారు.
Tags :