ASBL NSL Infratech

దుబాయ్ లో కాప్ సదస్సులో ప్రధాని ప్రతిపాదన ... భారత్ లో

దుబాయ్ లో కాప్ సదస్సులో ప్రధాని ప్రతిపాదన ... భారత్ లో

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిగిన కాప్‌ 28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రసంగిస్తూ 2028లో జరగాల్సిన కాప్‌ 33 సదస్సును భారత్‌లో నిర్వహిస్తామని ప్రధాని ప్రతిపాదించారు. ప్రపంచ జనాభాలో భరతదేశపు జనాభా 17 శాతం ఉన్నదని, కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో భారత్‌ నుంచి విడుదలయ్యేది కేవలం 4 శాతమే అని ప్రధాని తెలిపారు. నేషనల్లీ డిటర్మైండ్‌ కంట్రిబ్యూషన్‌(ఎన్‌డీసీ) లక్ష్యాల సాధన దిశగా తాము వేగంగా కదులుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు కూడా కర్బన ఉద్గారాల విడుదల తగ్గించుకోవాలని కోరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :