'మందిర' గా శృంగార తార సన్నీలియోన్ భయపెట్టనుందా?
!['మందిర' గా శృంగార తార సన్నీలియోన్ భయపెట్టనుందా?](https://www.telugutimes.net/storage/news/news_new_71967.jpg)
ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను మేకర్లు వదిలారు. మందిర చిత్రానికి సంబంధించిన టైటిల్, సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సన్నీ లియోన్‌ను ఈ పోస్టర్లో గమనిస్తుంటే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :