ASBL NSL Infratech

జగన్ అసెంబ్లీకి వస్తారా..??

జగన్ అసెంబ్లీకి వస్తారా..??

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్.. ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. గతంలో ఏ పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రాలేదు. ఒకసారికే ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకోవడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2019 నుంచి 2024 మధ్యకాలంలో టీడీపీని ఒక ఆట ఆడుకుంది వైసీపీ. ముఖ్యంగా అసెంబ్లీలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు చేసిన మాటల దాడి అంతాఇంతా కాదు. సాక్షాత్తూ చంద్రబాబే సభలో కన్నీరు పెట్టుకుని బయటికొచ్చి భోరున విలపించిన సన్నివేశాలు మనం చూశాం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీని మించిన మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. నాడు వైసీపీ చేసిన అవమానాలకు బదులిచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. దీంతో వైసీపీ ఎలా ఎదుర్కొంటుందనే ఉత్కంఠ ఏర్పడింది.

గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు ఉండేవారు. రోజా, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి ఉద్దండులు సభలో ఉండేవారు. టీడీపీని ధీటుగా ఎదుర్కొనేవారు. జగన్ పై మాట పడనిచ్చేవాళ్లు కాదు. కానీ ఇప్పడు వైసీపీ తరపున 11 మంది గెలవగా వాళ్లలో వీళ్లెవరూ లేరు. జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లంతా నోరు మెదిపడంలో దిట్ట కారు.

గతంలో కొంతకాలం అసెంబ్లీకి వెళ్లిన తర్వాత వెళ్లడం మానేసింది వైసీపీ. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే టాక్ జోరుగా నడుస్తోంది. 11 మందితో సభకు వెళ్లి అవమానాలు ఎదుర్కోవడం కంటే ఇంట్లో కూర్చోవడమే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. కానీ అలా పారిపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. కేడర్ లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కేడర్ కు భరోసా ఇవ్వాలంటే కచ్చితంగా సభకు వెళ్లి అధికారపక్షాన్ని ధీటుగా ఎదుర్కోగలగాలి. అప్పుడే వైసీపీ సత్తా ఏంటో తెలుస్తోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :