ASBL NSL Infratech

బాలయ్యకు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా..

బాలయ్యకు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా..

ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోనే కాక ఇటు రాజకీయంగా కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ నందమూరి అందగాడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అఖండమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మరో పక్క రాజకీయంగా కూడా బాలయ్యకు డోకా లేదు అన్న టాక్ వినిపిస్తోంది. హిందూపూరం నియోజకవర్గం నుంచి ఇప్పటికి రెండు సార్లు ఎన్నికైన బాలయ్య ముచ్చటగా హ్యాట్రిక్ విక్టరీ తనదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. స్వర్ణాంధ్ర రథం పేరుతో బాలయ్య తయారు చేసుకున్న ప్రత్యేక ఎన్నికల వాహనం ప్రచారానికి కదిలిన ప్రతి చోట జన సందోహం కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేకమైన క్రౌడ్ పుల్లర్ గా బాలయ్య కు మంచి గుర్తింపు ఉంది. 2014లో ప్రత్యక్షమైన ఎన్నికల్లో ఎంటర్ అయిన బాలయ్య హిందూపూరం నుంచి గెలిచినప్పటికీ కేవలం ఎమ్మెల్యే గానే మిగిలిపోయారు ఆ తర్వాత 2019లో ఆయన గెలిచినా.. టిడిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇలా తాను గెలిచిన రెండుసార్లు బాలయ్య ఎమ్మెల్యే కుర్చీ సరి పెట్టుకున్నారు. అయితే ఈసారి కూడా బాలయ్యకు మంత్రి అయ్యే ఛాన్స్ కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ టిడిపి గెలిస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. నారా లోకేష్ కి ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి అప్పగిస్తారు.. ఇక జనసేనాని ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా బాలయ్య కు మంత్రి అయ్యే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. మరి బాలయ్య ఈ విషయంలో రాజీ పడతారా లేదా అనేది త్వరలో తేలిపోతుంది..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :