ASBL NSL Infratech

ష‌ణ్ముఖ్ డిప్రెష‌న్ కు కార‌ణ‌మేంటి?

ష‌ణ్ముఖ్ డిప్రెష‌న్ కు కార‌ణ‌మేంటి?

సోష‌ల్ మీడియాలో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్, సూర్య లాంటి వెబ్ సిరీస్‌ల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని త‌ర్వాత బిగ్ బాస్ షో తో ఆ పాపులారిటీని మ‌రింత పెంచుకున్నాడు. ఆ మ‌ధ్య మందు తాగి కారు డ్రైవ్ చేసి పోలీసుల‌కు దొరికిన ష‌ణ్ముఖ్, తాజాగా గంజాయితో దొరికి మ‌రోసారి వార్తల్లోకెక్కాడు.

ష‌ణ్ముఖ్ సోద‌రుడు సంప‌త్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసి వేరే అమ్మాయిన పెళ్లి చేసుకున్న‌ట్లు ఓ అమ్మాయి కేసు పెట్ట‌డంతో అత‌డి ఫ్లాట్ కు వెళ్లిన పోలీసుల‌కు అక్క‌డ ష‌ణ్ముఖ్ గంజాయితో దొరికాడు. ఈ కేసులో ష‌ణ్ముఖ్ అరెస్ట్ అయి, బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ష‌ణ్ముఖ్ ఇంట్లో గంజాయి ఉన్నంత మాత్రాన అత‌ను గంజాయి తీసుకున్న‌ట్లు కాదు కదా అని ష‌ణ్ముఖ్ టీమ్ వాదిస్తుంది.

ఈ కేసులో నిజాలేంట‌న్న‌ది కోర్టు తేల్చాల్సి ఉంది. కాగా ఈ లోపు షణ్ముఖ్ వీడియో మ‌రొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. పోలీసులు ష‌ణ్ముఖ్ ఇంటికి వెళ్లిన‌ప్పుడు లేడీ పోలీస్ తో ష‌ణ్ముఖ్ ఏడుస్తూ మాట్లాడిన అస్ప‌ష్ట వీడియోలో తాను డిప్రెష‌న్ లో ఉన్న‌ట్లు ష‌ణ్ముఖ్ అన్నాడు. త‌న సిట్యుయేష‌న్ ఏమీ బాలేద‌ని, డిప్రెష‌న్ లో ఉన్న త‌న‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నిపిస్తోంద‌ని అత‌ను అన్నాడు. డిప్రెష‌న్ లో ఉండ‌టం వ‌ల్లే గంజాయి తీసుకోవ‌డానికి సోద‌రుడి ఫ్లాట్ కు వచ్చిన‌ట్లు ష‌ణ్ముఖ్ క‌వ‌ర్ చేయ‌డానికి ట్రై చేస్తున్న‌ట్లు భావిస్తున్నారు. ఒక‌వేళ ష‌ణ్ముఖ్ చెప్పిన మాట‌లు నిజ‌మైతే త‌న‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సినంత అవ‌స‌ర‌మేమొచ్చింద‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :