ASBL NSL Infratech

వాట్సప్ లో కొత్త ఫీచర్ ఫోన్ నంబర్ కు బదులు... యూజర్ నేమ్

వాట్సప్ లో కొత్త ఫీచర్  ఫోన్ నంబర్ కు బదులు... యూజర్ నేమ్

మెటాకు చెందిన వాట్సప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, డిజైన్‌లో మార్పులను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యూజర్‌నేమ్‌ సెర్చ్‌ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఫోన్‌ నంబర్లకు బదులు యూజర్‌ నేమ్‌ను షేర్‌ చేసుకునేందుకు ఈ ఫీచర్‌ కల్పించనుంది. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉంది. ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఎవరైనా మనతో వాట్సప్‌లో చాట్‌ చేయాలంటే ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి. కొందరికి వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై యూజర్లు ఫోన్‌ నెంబర్‌కు బదులు యూజర్‌ నేమ్‌ ఇస్తే సరిపోతుంది. సెర్బ్‌ బార్‌లో సంబంధిత యూజర్‌ నేమ్‌ ఎంటర్‌ చేస్తే యూజర్‌తో కనెక్ట్‌ కావొచ్చు. ఫోన్‌ నంబర్‌ పంచుకోవడం ఇష్టం లేని వ్యక్తులు ఈ యూజర్‌ నేమ్‌ను షేర్‌ చేసుకోవచ్చు. యూజర్‌ నేమ్‌ను వ్యక్తులు తమకు నచ్చినది ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్‌ కూడా చేసుకోవచ్చు. ఫోన్‌ నంబర్‌ పంచుకోవడంలో ఇబ్బంది లేదనుకుంటే ఎప్పటిలాగనే మొబైల్‌ నంబర్‌ను షేర్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :