ASBL Koncept Ambience
facebook whatsapp X

మ‌హేష్ బ‌ర్త్ డే స్పెష‌ల్స్ ఏంటో?

మ‌హేష్ బ‌ర్త్ డే స్పెష‌ల్స్ ఏంటో?

గుంటూరు కారం సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు బ‌య‌ట ఎక్కువ క‌నిపించింది లేదు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమా కోసం క‌స‌రత్తులు చేస్తున్నాడు మ‌హేష్. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెట్ ఇంకా రాలేదు. ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కాన్సెప్ట్ టీజ‌ర్ ను రెడీ చేయించే ప‌నిలో రాజ‌మౌళి బిజీగా ఉన్నాడ‌ట‌. కానీ ఫైన‌ల్ లుక్ కి రాజ‌మౌళి శాటిస్‌ఫై కాక‌పోతే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డు. ఇప్ప‌టికే రెండు మూడు ట్ర‌యిల్ షూట్స్ జ‌రిగాయి. కానీ వాటి డీటెయిల్స్ మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివ‌రాలు అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ తో పాటూ మీడియా కూడా ఎదురుచూస్తోంది.

29 టీమ్ నుంచి మ‌హేష్ బ‌ర్త్ డే కి ఎలాంటి గిఫ్ట్ ఆడియ‌న్స్ కు ఇస్తార‌నేది ఇప్పుడు చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మ‌హేష్ గ‌త సినిమాల్లోని ఖ‌లేజా లేదా మురారి రెండింటిలో ఏదో ఒక దాన్ని భారీగా రీరిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. మురారికి సంబంధించిన 4కె వ‌ర్క్స్ ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ట‌. ఇంకో నెల రోజుల పాటూ ఫ్యాన్స్ ఏ సినిమాను రీరిలీజ్ చేస్తారా అనే దానిపై స‌స్పెన్స్ ను భ‌రించాల్సిందే.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :