అమెరికా అంతరిక్ష సంస్థకు.. వీఆర్వీ పరిశ్రమ ఉత్పత్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఏర్పాటైన తొలి పరిశ్రమ వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమెటెడ్ సంస్థ అమెరికాలోని ఓ ప్రైవేటు అంతరిక్ష సంస్థకు పలు భారీ ద్రవ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను ఎగుమతి చేయడం ద్వారా కీలకమైన మైలురాయిని అధిగమించింది. క్రయోజెనిక్ స్టోరేజీ సొల్యూషన్స్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ఠంగా చేస్తూ ఈ మైలురాయిని అధిగమించడం తమకు గర్వకారణంగా ఉందని పీఆర్వీ ఎండీ జీఎల్ రంగ్నేకర్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీసిటిలోని అత్యధునిక ప్లాంటుతో ఏరోస్పేస్ పరిశ్రమ అవసరాలను తీర్చడానికి కృషి చేసిన కంపెనీ బృందాన్ని అభినందించారు. మేకిన్ ఇండియా స్ఫూర్తితో ప్రపంచస్థాయిలో కీలక రంగంలో అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తున్నందుకు కంపెనీ యాజమాన్యానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Tags :