ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాయకులు అన్ని వైపులా ఉన్నారు.. ఓటర్లు ఎటువైపు ఉన్నారు?

నాయకులు అన్ని వైపులా ఉన్నారు.. ఓటర్లు ఎటువైపు ఉన్నారు?

ఆంధ్రాలో ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలయింది. దీంతో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల హడావిడి గట్టిగా కనిపిస్తోంది. ఎవరికివారు విజయం తమదే అని ధీమా తో ఉన్నారు. కానీ ఓటర్ల నాడీ ఎట్లా ఉంది అన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎవరి సర్వే వాళ్ళు చేసుకుంటున్నారు.. ఎవరికి తగిన రిపోర్టు వాళ్లకు వస్తున్నాయి. జగన్ సభకి జనాలు వస్తున్నారు.. చంద్రబాబు సభకి జనాలు వస్తున్నారు. అయితే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే.. ఓటర్లు ఎటువైపు ఉన్నారు? పాత పథకాల భరోసా ఒకవైపు.. కొత్త పథకాల ఆశ మరొకవైపు. ప్రతి ఒక్కరి మేనిఫెస్టో సామాన్య ఓటర్ల కు కావలసిన అంశాలతో నిండిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఈ పథకాలు అన్ని కూడా పేద వారికే లభిస్తాయి. ధనికులకు వీటి అవసరం లేదు మిగిలింది మధ్యతరగతి కుటుంబాలు. పథకాలకు వీరు పనికిరావు.. ఎటువంటి గవర్నమెంట్ స్కీములు వీళ్ళకి వర్తించవు.. ఈ నేపథ్యంలో మ్యానిఫెస్టోల ప్రభావం వీరి పై చాలా స్వల్పం అనడంలో సందేహం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో అంచనాలను తలకిందులు చేసే బ్యాచ్ మిడిల్ క్లాస్ బ్యాచ్.. మరి ఈసారి ఓటర్ అన్నల ఓటు ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :