బీజేపీలో కేసీఆర్ మనిషి... అందుకే ఆయన పదవి పోయింది

మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని సినీనటి విజయశాంతి అన్నారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లాను. ఏళ్లు గడిచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒక్కటే. తెరపై విమర్శలు, తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించవద్దని కోరాం. సంజయ్‌ను తొలగించడంతో బీజేపీ పరువు పోయింది అని విమర్శించారు.







Tags :