ASBL NSL Infratech

కొత్తగా ట్రై చేస్తున్న విజ‌య్

కొత్తగా ట్రై చేస్తున్న విజ‌య్

డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ స్టార్ చేస్తున్న విజ‌య్, ఆ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్, గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేయ‌నున్నాడు.

మార్చి రెండో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక‌ల్ క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. ఈ సినిమాలో విజ‌య్ లుక్ కొత్త‌గా, ఫ్రెష్ గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జెర్సీ లాగే ఈ సినిమా కూడా ఆడియ‌న్స్ కు కొత్త అనుభూతిని క‌లిగించ‌నుంద‌ట‌.

గౌత‌మ్ సినిమా త‌ర్వాత విజ‌య్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను చేయ‌నున్నాడు. రాజా వారు రాణి గారు సినిమా ఫేమ్ ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఈ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజే నిర్మించ‌నున్నాడు. ఇది కాకుండా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్య్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా విజ‌య్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. రాహుల్ తో విజ‌య్ చేయ‌నున్న సినిమా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో ఉండ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి డిఫ‌రెంట్ కాన్సెప్టుల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న విజ‌య్ ఆ సినిమాల‌తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :