అంచనాలకు అతీతంగా వెంకీ
ముందు నటుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి ఆ తర్వాత కూడా నటుడిగానే కంటిన్యూ అవుతాడనుకుంటే దానికి భిన్నంగా రైటింగ్ వైపు అడుగులేసి ఏకంగా డైరెక్టర్ అయిపోయాడు. మొదటి సినిమాగా వరుణ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ క్లాసిక్ టైటిల్ అయిన తొలి ప్రేమ అని సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఈ తొలి ప్రేమ సినిమా కూడా యంగ్ ఆడియన్స్ లో ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.
మొదటి సినిమాతోనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో నిరాశ పరచడంతో క్రమంగా ఆడియన్స్ కు ఆయన మీద నమ్మకం తగ్గింది. కానీ ఆ తర్వాత వెంకీ తన రూట్ ను టోటల్ గా మార్చేశాడు. ధనుష్ ను ఒప్పించి సార్ అనే సినిమా చేయడమే కాకుండా దాన్ని మంచి హిట్ కూడా చేశాడు.
వెంకీ నుంచి వచ్చిన మొదటి మూడు సినిమాలు చూశాక, అతన్నుంచి సార్ లాంటి సినిమానైతే ఎవరూ ఊహించరు. ఇకపోతే సార్ తర్వాత వెంకీ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురుచూశారు. మరోసారి వెంకీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొత్త జానర్ ను ఎంచుకున్నాడు. దుల్కర్ సల్మాన్ తో ఓ కొత్త జానర్ లో లక్కీ భాస్కర్ అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తుంటే కాన్సెప్ట్, విజువల్స్ అన్నీ చాలా కొత్తగా అనిపించాయి. అసలు దుల్కర్ లాంటి విలక్షణ నటుడ్ని ఒప్పించడమే వెంకీ సాధించిన మొదటి అఛీవ్‌మెంట్. దానికి తోడు టీజర్ కూడా ఆడియన్స్ ను మరో లోకంలోకి తీసుకెళ్లింది. ఏదేమైనా వెంకీ సినిమా సినిమాకూ జానర్లను భలే మారుస్తున్నాడు.