ASBL NSL Infratech

సీనియ‌ర్ హీరోల్లో వెంక‌టేష్ స్పెష‌ల్

సీనియ‌ర్ హీరోల్లో వెంక‌టేష్ స్పెష‌ల్

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలంద‌రిలో వెంకీ స్పెష‌ల్ అని చెప్పాలి. త‌న తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ కేవ‌లం వెండితెర‌కే ప‌రిమిత‌మైతే వెంక‌టేష్ మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రోజురోజుకీ థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గిపోతుంది.

ఓటీటీకి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే వెంక‌టేష్ ఓటీటీలోకి వెబ్ సిరీస్ ద్వారా ఎంట‌ర‌య్యాడు. మొద‌టి సిరీస్ గా రానాతో క‌లిసి రానా నాయుడుని చేసి మంచి స‌క్సెస్ ను అందుకున్న వెంకీ ఇప్పుడు ఆ సిరీస్ కు రెండు, మూడు భాగాల్లో న‌టిస్తున్నాడు. ఇది కాకుండా రీసెంట్ గా అనిల్ రావిపూడితో క‌లిసి ఓ సినిమాను అనౌన్స్ చేశాడు.

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు ఎంత‌గానో ట్రై చేస్తున్నాడు. అదే ఏడాది మిడిల్ లో రానా నాయుడు -3 కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండింటి మ‌ధ్య గ్యాప్ లో రానా నాయుడు2 వ‌స్తుంది. ఇలా ఆడియ‌న్స్‌కు, త‌న‌కు మ‌ధ్య ఉన్న దూరాన్ని భ‌లే బ్యాలెన్స్ చేస్తున్నాడు వెంకీ. ఈ మ‌ధ్యలో ఏదైనా క‌థ న‌చ్చితే వాటిని లాక్ చేసుకుని పెడ‌తాడు. ఏదైతేనేం క‌నీసం సంవ‌త్స‌రానికి ఒక సినిమా అయినా ఉండేలా వెంకీ త‌న కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.  
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :