వైజాగ్ వెళ్లనున్న VD12 టీమ్
రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినా కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అయింది. ఏప్రిల్ 5న రిలీజైన ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. మే 3న ఫ్యామిలీ స్టార్ ప్రైమ్ వీడియోలోకి రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
మొన్నటివరకు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా మొదలైంది. హీరోయిన్ గా శ్రీలీలను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు డేట్స్ అడ్జెస్ట్ అవక శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె ప్లేస్ లోకి ఎవరు వస్తున్నారనేది మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో మొదలైంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం టీమ్ మొత్తం వైజాగ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28 నుంచి కొద్ది రోజుల పాటూ VD12 షూటింగ్ అక్కడే జరగనుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ గురించి మేకర్స్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.