ASBL Koncept Ambience
facebook whatsapp X

దిల్ రాజు వల్ల గట్టిగా హర్ట్ అయిన అజిత్ ఫాన్స్..?

దిల్ రాజు వల్ల గట్టిగా హర్ట్ అయిన అజిత్ ఫాన్స్..?

తమిళ హీరో దళపతి విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ యాక్షన్ డ్రామా `వారీసు`. ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నిర్మాత దిల్ రాజు నోటీకి తాళం వేయక తప్పదేమో? అనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ జోరుగా వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ మధ్య ఆయన ఏం మాట్లాడినా సరే వివాదం అవుతోంది అని అంటున్నారు. కానీ ఆయన మాటలే వివాదాస్పదంగా ఉంటున్నాయి అనడంలో అతిశయోక్తిలేదు. 

విజయ్ తో తమిళంలో నిర్మిస్తున్న `వారీసు` సినిమాని తెలుగులో `వారసుడు`గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`, ' వీర సింహా రెడ్డి` సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. విజయ్ `వారసుడు` కోసం దిల్ రాజు తెలంగాణ ఉత్తరాంధ్రల్లో కీలక థియేటర్లని బ్లాక్ చేసాడు అన్న విషయం తెలిసిందే.

థియేటర్లు బ్లాక్ చేయడం వల్ల `వాల్తేరు వీరయ్య` వీర సింమారెడ్డి` సినిమాలకు థియేటర్లు లభించని పరిస్థితిని క్రియేట్ చేశాడంటూ గత కొన్ని రోజులుగా దిల్ రాజు పై వివాదం నడుస్తోంది. ఈ విషయంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పత్రికా ప్రకటన ఇవ్వడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. సోషల్ మీడియాలో గత కొంత కాలంగా ఇదే వార్త చర్చనీయాంశం అయింది.

రీసెంట్ గా ఓ మీడియాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజు, తమిళ ఇండస్ట్రీలో  విజయ్ బిగ్ స్టార్ అని అజిత్ ని మించిన హీరో అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసారు. అజిత్ సినిమాకు మించి తను విజయ్ తో నిర్మిస్తున్న `వారీసు` చిత్రానికి అదనంగా మరో 50 థియేటర్లు ఇవ్వాలని స్టేట్ మెంట్ ఇవ్వడంతో అజిత్ ఫ్యాన్స్ గట్టిగానే హర్ట్ అయ్యారట.

టాలీవుడ్ లో `వారసుడు` థియేటర్ల వివాదం నడుస్తుంటే తాజాగా కోలీవుడ్ లో దిల్ రాజు అన్నస్టేట్ మెంట్ పై పెద్ద దుమారమే మొదలైంది. అయితే దీనిపై స్పందించిన దిల్ రాజు పూర్తి వీడియో చూడకుండా తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని అజిత్ ఫాన్స్ పై మండిపడ్డారు. అజిత్ ఫాన్స్ నుండి తప్పించుకోవడానికి దిల్ రాజు ప్రయత్నిస్తుంటే , మరోవైపు విజయ్ ఫాన్స్ కావాలని టార్గెట్ చేస్తుండడం క్రేజీ గా ఉంది.

తమిళనాడుతో విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ దిల్ రాజు అన్న వీడియోని అజిత్ అభిమానులకు ట్యాగ్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ మొదలు పెట్టారట. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు మాటలకు గట్టిగానే హర్ట్ అయ్యారట. ప్రస్తుతం అజిత్ ఫాన్స్ కి దిల్ రాజు విలన్ గా మారాడని నెట్టింట ట్రోల్ల్స్ మొదలయ్యాయి. మరి ఈ వివాదం `వారీసు` రిలీజ్ వరకు ఎలాంటి మలుపు తిరుగుందో వేచి చూడాల్సిందే.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :