వైష్ణవ్-రీతూ రిలేషన్‌షిప్‌లో నిజమెంత?

తమ మధ్య ఏమీ లేదనంటూనే చివరకు వెడ్డింగ్ కార్డ్ ప్రింటేయిస్తున్నారు ప్రస్తుత సెలబ్రిటీలు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ నుంచి మొదలైన ట్రెండ్, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వరకు అందరూ ఫాలో అవుతున్నారు. చివర వరకు రిలేషన్‌షిప్‌ను సీక్రెట్ గా మెయిన్‌టెయిన్ చేస్తూ పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరో ఇద్దరు సెలబ్రిటీలు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ రిలేషన్ లో ఉన్నారని నెట్టింట పుకార్లు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారమవుతుంది. అందుకే మొన్న ఇటలీలో జరిగిన వరుణ్-లావణ్య పెళ్లిలో వధూవరుల కుటుంబ సభ్యులతో పాటూ రీతూ వర్మ కూడా కనిపించిందని, పెళ్లికి ముందు బన్నీ ఇచ్చిన ప్రైవేట్ పార్టీలో కూడా రీతూ వర్మ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
దీంతో రీతూ వర్మ, మెగా కుటుంబానికి చెందిన ఓ హీరోతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై రీసెంట్ గా ఆదికేశవ ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ స్పందించాడు. లావణ్య త్రిపాఠికి రీతూ వర్మ మంచి ఫ్రెండ్ అని, అందుకే పెళ్లి వేడుకలో సందడి చేసిందని అతడు తెలిపాడు. అంతకుమించి ఏమీ లేదని వైష్ణవ్ తేజ్ రూమర్లను కొట్టిపారేశాడు. వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.






