MKOne TeluguTimes-Youtube-Channel

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రాచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. ఇక భద్రాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా  రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సింహాచలంలో స్వామివారి ఉత్తరద్వారా దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్తల అశోగ గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు.  

 

Tags :