అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త... వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయి
అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకు విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. ఢల్లీిలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలలోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ దఫా విస్తృత స్థాయిలో స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో, ఆ తర్వాత జులైకు, అవసరాన్ని బట్టి ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేయనుంది.
అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరానికి సంబంధించి ఫాల్ సీజన్ ఏటా ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభం అవుతుంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు అన్ని కాన్సులేట్ కార్యాలయాలకు శని, ఆదివారాలు సెలవు. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శనివారాల్లో, ఆదివారాలైన ఈ నెల 19, 26 తేదీ ల్లోనూ స్లాట్లు కేటాయించారు.