ASBL NSL Infratech

హెచ్-4 వీసాదారులకు గుడ్ న్యూస్ !

హెచ్-4 వీసాదారులకు గుడ్ న్యూస్ !

అమెరికాలో హెచ్‌-4 వీసా కలిగిన వారికి ఉరటనిచ్చే కీలక బిల్లును త్వరలో సెనెట్‌ ఆమోదించనుంది. దీంతో సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరనుంది. అమెరికన్‌ సెనెట్‌లో రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయస్సు వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్‌ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఇది పూర్తవడానికి ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్‌-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపన్నుట్లు వైట్‌హౌజ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :