శ్వేత సౌధంలో బైడెన్ మనుమరాలి వివాహం

శ్వేత సౌధంలో బైడెన్ మనుమరాలి వివాహం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మనుమరాలు నవోమీ బైడెన్‌ వివాహం శ్వేతసౌధంలో జరిగింది. 28 ఏళ్ల నవోమీ, పాతికేళ్ళ పీటర్‌ నీల్‌ను వివాహం చేసుకున్నారు. వైట్‌హౌస్‌లో పెళ్లి  చేసుకున్న 19వ జంటగా వీరు గుర్తింపు పొందారు. నవోమీ గ్రాండ్‌ పేరెంట్స్‌ జో బైడెన్‌, జిల్‌ బైడెన్‌ వారి బంధువులు, మిత్రులు, ఇతర ప్రముఖలు సమక్షంలో వధూవరులిద్దరూ ఒక్కటయ్యారు. ఈ  వేడుకకు దాదాపు 250 మంది అతిథులు హాజరయ్యారు. నవోమీ, పీటర్‌ నీల్‌ల ఎంగేజ్‌మెంట్‌ 2021లో జరిగింది. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. వైట్‌హౌస్‌లో తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు.  కాగా, గత దశబ్దకాలంలో వైట్‌హౌస్‌లో వివాహ వేడుక జరగడం ఇదే తొలిసారి.

 

Tags :