MKOne Telugu Times Youtube Channel

అందుకే అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్నా : జో బైడెన్

అందుకే అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్నా : జో బైడెన్

రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన బైడెన్‌  డెమోక్రటిక్‌ పార్టీ తరపున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రచారం మొదలు పెట్టారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కూడా వచ్చే ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యం కోసం, తమ ప్రాథమిక స్వేచ్ఛ కోసం ప్రతి తరం వారు నిలబడాల్సిన క్షణం ఒకటి ఉంటుంది. ఇది మన సమయం అని నేను మన్ముతున్నా. అందుకే అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడుతున్నా. మాకు మద్దతుగా నిలవండి అని అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల అతివాదంపై పోరాటం ఆయన అభివర్ణించారు.

 

 

Tags :