ASBL NSL Infratech

ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు నిక్కీహేలీ ప్రయత్నం...

ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు నిక్కీహేలీ ప్రయత్నం...

రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు తుదిదశకు చేరింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్.. రేసులో ముందంజలోనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రైమరీల్లో వరుస ఓటములు ఎదురైనా నిక్కీ హేలీ మాత్రం.. రేసులోనే కొనసాగుతున్నారు. ఓవైపు వరుసగా అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకుంటున్నా.. ఆమె మాత్రం పోటీ చేయాలన్న తన సంకల్పానికి అంకితమైనట్లు కనిపిస్తోంది. రష్యా విపక్షనేత నావల్నీ హత్య, నాటోపై ట్రంప్ వ్యాఖ్యలను సౌత్ కరోలినా ప్రసారంలో టార్గెట్ చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే నాటోతో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలతో అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేస్తామని భారతీయ అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భరోసా ఇచ్చారు. ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే నాటో కూటమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నిక్కీ. నాటో కూటమికి రష్యా, చైనా వంటి దేశాలు భయపడుతున్నాయని, దాన్ని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. కూటమితో పాటు మరికొన్ని దేశాలతో బంధం మరింత దృఢంగా ఉండేలా చూసుకోవాలని అప్పుడే శత్రుదేశాలు హద్దుల్లో ఉంటాయని అభిప్రాయపడ్డారు.

నాటోపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అధికారమిచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులను చంపే ఓ దుండగుడి వైపు ఆయన ఉన్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అనేక రంగాల్లో విఫలమయ్యారని నిక్కీ హేలీ విమర్శించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల గురించి మాట్లాడుతూ.. ‘‘పుతిన్‌ ఉక్రెయిన్‌ను చుట్టేసినట్లే పోలండ్‌, బాల్టిక్‌ దేశాలనూ ఆక్రమించాలని చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అమెరికా కచ్చితంగా యుద్ధ రంగంలో ఉంటుంది. ఎందుకంటే అవి నాటో దేశాలు. వాటికి మా సహాయం చాలా ముఖ్యం’’ అని నిక్కీ స్పష్టంచేశారు.

బైడెన్, ట్రంప్ లాంటి వాళ్లతో ఏమీ సాధ్యం కాదని.. తాము మాత్రం నాటో కూటమి ఆవశ్యకతను ఎప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు నిక్కీ. బైడెన్ టిక్‌టాక్ ఉపయోగించడంపైనా హేలీ ఫైరయ్యారు. యంగ్ అమెరికన్లను హమాస్, ఒసామాబిన్ లాడెన్ ఆశయాల సాధనకు టిక్‌టాక్ ఉపయోగపడుతోందని నిక్కీ హేలీ బ్లేమ్ చేశారు. టిక్ టాక్ సీఈవోకు చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందాలున్నాయని ఆరోపించారు. చైనా.. ఆయుధ రహస్యాలు తస్కరించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నారు హేలీ. అలాంటి సంస్థ రూపొందించిన యాప్‌ను అధ్యక్షుడు వాడడం సరికాదన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :