హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
హెచ్ 1బీ వీసా నమోదు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తేదీతోనే రిజిస్ట్రేషన్ల గడువు ముగియాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురుర్కొంటున్నారని వెల్లడిరచింది. హెచ్ 1బీ రిజిస్ట్రేషన్లకు అవసరమైన జీ-28 ఫారంలో కొందరి సంతకాలు కనిపించకుండా పోతున్నట్లు చెబుతున్నారు. దీంతో నమోదును 25వ తేదీ వరకు కొనసాగిస్తామని వివరించింది. ఈ ఏడాది సుమారు 3.50 లక్షల మంది హెచ్1 బీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్‌సీఐఎస్ అంచనా వేస్తోంది.ఎంపికైన దరఖాస్తుదారుల పేర్లను మార్చి 31వ తేదీన ప్రకటిస్తామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
Tags :