ASBL NSL Infratech

భారతీయులకు తగ్గిన ఈబీ-5 వీసాల జారీ

భారతీయులకు తగ్గిన ఈబీ-5 వీసాల జారీ

అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఈబీ-5 వీసాలు పొందుతున్న భారతీయుల సంఖ్య గత ఎనిమిది నెలలుగా తగ్గుతున్నది. 2024 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసుకుంటే ఈబీ-5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య ముందు ఏడాది కంటే పెరిగినపన్పటికీ, గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది మే వరకు మాత్రం 22 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో కేవలం 512 మంది భారతీయులకు మాత్రమే ఈబీ-5 వీసాలు జారీ అయ్యాయి. అమెరికాలో ఎనిమిది లక్షల డాలర్లు ( దాదాపు రూ.6.67 కోట్లు) పెట్టుబడి పెట్టి, కనీసం 10 మంది అమెరికన్లకు ఉపాధి కల్పించే వారికి ఈబీ-5 వీసా జారీ చేస్తారు. ఈ వీసా లభించిన వారికి అమెరికాలో శాశ్వత నివాసం కోసం త్వరగా గ్రీన్‌ కార్డు వస్తుంది. ఎనిమిది నెలలుగా ఈబీ-5 వీసా పొందుతున్న భారతీయుల సంఖ్య తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోల్చితే భారతీయులే ఎక్కువగా ఈ వీసాలు పొందుతున్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :