ASBL NSL Infratech

రివ్యూ : డిఫరెంట్ కంటెంట్ తో 'ఉగ్రం'

రివ్యూ : డిఫరెంట్ కంటెంట్ తో 'ఉగ్రం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థలు : షైన్ స్క్రీన్, అంజి ఇండస్ట్రీస్,  
నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు,
మణికంఠ వారణాసి, శరత్ లోహితస్వ, శ్రీనివాస సాయి తదితరులు నటించారు.  
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, సంగీత దర్శకులు: శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె
నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది
దర్శకుడు : విజయ్ కనకమేడల
విడుదల తేదీ: 05.05.2023

అల్లరి నరేష్ చిత్రం అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కంటెంట్ ఉన్న చిత్రాలతో వస్తున్నాడు. ఈ మధ్య నాంది చిత్రంతో అల్లరి నరేష్ తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అదే పంథాను కొనసాగిస్తూ ఉగ్రం సినిమా చేశాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులకు ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ ని చూపించబోతున్నట్లు చాటిన నరేష్.. తాజాగా ఉగ్రంతో బాక్సాఫీస్ ముందుకొచ్చేశాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించాడు. మరి, ఈ సినిమా కథేంటి.. మూవీ ఎలా ఉంది.. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:

సిఐ శివ కుమార్, (అల్లరి నరేష్) సిన్సియర్ పోలీసాఫీసర్. ఎన్నో చిక్కుముడులు ఉన్న కేసులను ఇట్టే పరిష్కరిస్తుంటాడు. అపర్ణ (మిర్న మీనన్) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఒక పాప పుడుతుంది. వీరి జీవితం ఇలా హాయిగా సాగిపోతున్న తరుణంలో అల్లరి నరేష్ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో సిఐ శివ కుమార్ మెమోరీ పోతుంది. అంతేకాదు, భార్య,బిడ్డ కూడా కనిపించకుండా పోతారు. సిఐ శివ కుమార్ భార్య, బిడ్డ తరహాలోనే సిటీలో ఎంతోమంది కనిపించకుండా పోతారు. ఇలా కనిపించకుండా పోవడానికి సిటీలోని హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠాయే కారణం.. ఈ ముఠా ఆగడాలకు సిఐ శివ కుమార్ ఎలా చెక్ పెట్టాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి.. ఇదే ఉగ్రం సినిమా.

నటీనటుల హావభావాలు:

ఈ సినిమా అల్లరి నరేష్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఎందుకంటే, సినిమా కథ మొత్తం అల్లరి నరేష్ చుట్టూనే తిరుగుతుంది. సీఐ శివకుమార్ గా అల్లరి నరేష్ ఔట్ స్టాండింగ్ పర్ ఫార్మెన్స్ కనబరిచాడు. అల్లరి నరేష్ ఒక కామెడీ హీరో అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కలగదు. అంతగా తనను తాను ట్రాన్స్ ఫర్మ్ చేసుకున్నాడు. నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. అలాగే ప్రధాన పాత్రలో నటించిన శత్రు కూడా చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన మిర్నా తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో బాగానే నటించింది. మెయిన్ గా హీరో – ఇజ్రాల గెటప్స్ లో ఉన్న విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు పర్వాలేదు. మరో కీలక పాత్రలో నటించిన ఇంద్రజ కూడా బాగానే నటించింది. శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ మరియు వారి నటన బాగున్నాయి.

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు విజయ్ రాసుకున్న కథ బాగుంది. కథనాన్ని కూడా బాగానే నడిపించాడు. అయితే సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపించినా...కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టించకుండా దర్శకుడు ముందుకు తీసుకెళ్లాడు. హీరో మిస్టరీని సాల్వ్ చేసే విధానం, కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయిని పెంచాయని చెప్పాలి. సిద్ధార్థ్ జె సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు సాహు గారపాటి & హరీష్ పెద్ది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

ఉగ్రం అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఐతే, కథనంలో కొన్ని చోట్ల ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడం, అలాగే స్క్రీన్ ప్లే బోర్ గా సాగడం, కొన్ని సీక్వెన్స్ లో లాజిక్స్ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా నాంది చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న అల్లరి నరేష్ తాజాగా తన ఉగ్రం మూవీతో కూడా మరో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ తో పాటు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమాని తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా స్ఫూర్తితో అల్లరి నరేష్ నుంచి ఇకపై డిఫరెంట్ సినిమాలే వస్తాయని మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :