టిటిడి ఆధ్వర్యంలో యూరప్, యుకెలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఎపిఎన్‌ఆర్‌టీఎస్ సహకారంతో, యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ వినతిమేరకు యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహిస్తున్నారు. యుక్తా అసోసియేషన్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న అసోసియేషన్లతో కలిసి పలు భారతీయ, తెలుగు, ధార్మిక మరియు సేవా సంస్థల కార్యనిర్వాహక వర్గాలతో కలిసి ఈ కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
తిరుమల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి విగ్రహాలను, టీటిడి అర్చకులు, వేదపండితులు ఈ కళ్యాణ మహోత్సవం కోసం యూరప్, యుకె దేశాలకు వచ్చారు. వైఖానస ఆగమం ప్రకారం శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించి స్వయంగా తిరుమల నుంచి తెప్పించిన లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందజేయనున్నారు. అందరూ ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని, ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి చైర్మన్, వై.వి. సుబ్బారెడ్డి, ఎపిఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు.
ఈ ఉత్సవాలకు సంబంధించి ఇతర వివరాలకోసం ఈ ఫ్లయర్‌ను చూడండి.