సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశారు. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. అదే సమయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 09 తేదీ వరకూ ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వాన శుభ పత్రికను అందజేశారు.
Tags :