ASBL NSL Infratech

టీటీఏ షార్లట్‌ హోలీ వేడుకలు

టీటీఏ షార్లట్‌ హోలీ వేడుకలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో నార్త్‌ కరొలినాలోని షార్లట్‌లో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో వెయ్యి మందికిపైగా ఔత్సాహికులు పాల్గొని హోలీ జరుపుకున్నారు. తెలంగాణ సంప్రదాయాలను పరిరక్షించడం కోసం కృషి చేసే టీటీఏ.. రెడ్డి క్రీక్‌ పార్క్‌లో ఈ వేడుకలు నిర్వహించింది. ఉచితంగా ఆర్గానిక్‌ రంగులు అందజేయడంతోపాటు ఉత్సాహవంతమైన సంగీతంతో విచ్చేసిన వారందర్నీ నిర్వాహకులు అలరించారు. ఈ సందర్భంగా టీటీఏ అడ్వైజరీ లీడర్లయిన ఫౌండర్‌ పైళ్ల మల్లారెడ్డి, ప్రెసిడెంట్‌ వంశీ రెడ్డి వంటి అడ్వైజరీ లీడర్లకు  టీటీఏ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ మల్లిపెద్ది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన షార్లట్‌ బృందానికి అభినందనతలు అందజేశారు. ప్రత్యేకించి షార్లట్‌ రీజనల్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, మహిళా బృందాల కృషిని కొనియాడారు. తమకు ఎంతో సహకారం అందించిన టీటీఏ అన్ని టీంల సభ్యులు, వాలంటీర్లకు టీటీఏ షార్లట్‌ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

షార్లెట్‌ టీమ్‌లో అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మల్లిపెద్ది, నిశాంత్‌ సిరికొండ-మీడియా మరియు కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌, శివ కర్మురు - బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, శ్రీకాంత్‌ గాలి - బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, అభిలాష్‌ ముదిరెడ్డి - బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, దిల్ప్‌ శ్యాసాని, అరుణ్‌ కొత్తూర్‌, అనుక్ష్‌ వీర్రెడ్డి, భరత్‌ జెల్ల, ప్రవీణ్‌ రెడ్డి, వెంకట్‌ జమ్ముల్లా, నరేన్‌ దేవరపల్లి, శ్రీషా చింతకుంట్ల, నిఖితా జూలకంటి, దీప్తి మిర్యాల, కవిత గుండేటి, కౌశిక్‌ రెడ్డి, మహేష్‌ గుండెంటి, రమేష్‌ చింతకుట్ల, వరుణ్‌ తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :