MKOne Telugu Times Youtube Channel

డొనాల్డ్ ట్రంప్ పై మరో మహిళ ఫిర్యాదు

డొనాల్డ్ ట్రంప్ పై మరో మహిళ ఫిర్యాదు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76)ను ఒకదాని తర్వాత మరో కేసు వెంటాడుతూనే ఉన్నాయి. 1996లో ట్రంప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కారొల్‌ (79) చేసిన ఆరోపణల కేసు తాజాగా తెరపైకి వచ్చింది. మన్‌ హట్టన్‌లోని యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో ఈ సివిల్‌ వివాదానికి సంబంధించిన విచారణ మొదలయ్యింది. 1996లో మన్‌హట్టన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో కారొల్‌కు ట్రంప్‌ ఎదురయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇచ్చేందుకు తనను సలహా అడిగారు. ట్రంప్‌ సరదాగా అడగడంతో అంగీకరించి ఆమె ఆరో ఫ్లోర్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ సెక్షన్‌లో ఎవరూ లేరు. దుస్తులు మార్చుకునే గదిలోకి వచ్చిన ట్రంప్‌ కారొల్‌పై లైంగిక దాడికి పాల్పడారు అని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆ ఘటనతో షాక్‌కు గురైన కారొల్‌ అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

 

 

 

Tags :