ASBL NSL Infratech

మిషిగన్ ప్రైమరీలో బైడెన్, ట్రంప్ విజయం

మిషిగన్ ప్రైమరీలో బైడెన్, ట్రంప్ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ  పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రైమరీల్లో గెలిచిన ట్రంప్‌ తాజాగా మిషిగన్‌ ప్రైమరీలోనూ తన సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ 66.4 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి నిక్కీ హేలీపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు అదే రాష్ట్రంలో డెమోక్రాట్ల తరపున ఆ పార్టీ నేత జో బైడెన్‌ కూడా విజయం సాధించారు. అయితే ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో బైడెన్‌ వైఖరికి నిరసనగా డెమోక్రాటిక్‌ పార్టీలోని ముస్లిం ఓటర్లు ఆయనకు మద్దతివ్వకుండా తటస్థంగా ఉన్నట్లు తెలిసింది. ఆ పార్టీ ఓటర్లలో వీరు 14 శాతంగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :