MKOne Telugu Times Business Excellence Awards

మేక్రాన్ పై డొనాల్డ్ ట్రంప్ అసహనం

మేక్రాన్ పై డొనాల్డ్ ట్రంప్ అసహనం

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఇటీవల చైనాలో పర్యటించిన విషయం విదితమే. ఉక్రెయిన్‌-రష్యా యుద్దం తైవాన్‌ వంటి అంశాలపై జిన్‌పింగ్‌తో చర్చలు జరపడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. తనకు మిత్రుడైన మేక్రాన్‌ సొంత ప్రయోజానాల కోసం జిన్‌పింగ్‌తో కలిసి తిరుగుతుతున్నారని దుయ్యబట్టారు. ఫ్రాన్స్‌ ఇప్పుడు చైనాతో కలిసి సాగుతోంది అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా, ఉక్రెయిన్‌,రష్యా మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించాలని చైనా పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ జిన్‌పింగ్‌కు సూచించారు. మరోవైపు  తైవాన్‌ విషయంలో  చైనా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అందులో యూరప్‌ దేశాలు చిక్కు కోరాదని అన్నారు. అంతే కాకుండా అమెరికా విదేశాంగ విధానంతోనూ యూరోపియన్లు తమను తాము బంధించుకోకూడదని మేక్రాన్‌ చేసిన హెచ్చరికలు పాశ్చాత్య దేశాలను కలవరపెట్టాయి. అమెరికా మాత్రం ఫ్రాన్స్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపింది. 

 

 

Tags :