ASBL Koncept Ambience
facebook whatsapp X

లోక‌ల్ ఫ్లేవ‌ర్ తో బ‌న్నీ- త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా సినిమా

లోక‌ల్ ఫ్లేవ‌ర్ తో బ‌న్నీ- త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా వ‌చ్చింది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు మంచి హిట్ అవడంతో వీరి కాంబో అన‌గానే అంద‌రికీ అంచ‌నాలు పెరిగిపోతాయి.

ఇప్ప‌టివ‌రకు వీరి కాంబోలో వ‌చ్చిన సినిమాల‌ను మించేలా త‌మ త‌ర్వాతి సినిమా ఉండాల‌ని బ‌న్నీ, త్రివిక్ర‌మ్ అనుకుంటున్నార‌ట‌. అందుకే ఈసారి కేవ‌లం తెలుగులోనే కాకుండా మిగిలిన భాష‌ల్లో కూడా సినిమా హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం వీరి కాంబోలో రానున్న సినిమాలో అల్లు అర్జున్ పూర్తిగా తెలంగాన మాండ‌లికంలో డైలాగ్స్ చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో రుద్ర‌మ‌దేవి సినిమాలో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌లో తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్పి మెప్పించిన బ‌న్నీ, ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా కోసం తెలంగాణ‌ లోక‌ల్ ఫ్లేవ‌ర్‌కు త‌గ్గ‌ట్టు డైలాగులు చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. క‌థ పాన్ ఇండియా స్థాయిలో అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే విధంగా ఉన్న‌ప్పటికీ లోకల్ ఫ్లేవ‌ర్ ను త్రివిక్ర‌మ్ హైలైట్ చేయ‌నున్న‌ట్లు టాక్. ప్ర‌స్తుతం త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ పైనే వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక సినిమా గురించి మ‌రోసారి క్లారిటీ వ‌చ్చే ఛాన్సుది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప‌2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :