త్రిష డిమాండ్ అలాంటిది మరి
40 ఏళ్ల వయసులో కూడా త్రిష స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తోంది. ఒకప్పుడు జయసుధ, విజయశాంతి టైమ్ లో ఇలా నాలుగు పదుల వయసులో కూడా డిమాండ్ ఉండేది కానీ ఇప్పటి ట్రెండ్ లో అది దాదాపు అసాధ్యమే. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా మంచి మంచి ఆఫర్లు పట్టేస్తుంది. ఆఫర్లతో పాటూ రెమ్యూనరేషన్ పరంగా కూడా అమ్మడు రికార్డులు క్రియేట్ చేస్తోంది.
తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాకు గానూ త్రిష అక్షరాలా రూ.12 కోట్లు తీసుకుంటుందని టాక్. త్రిష చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులున్నాయి. చిరంజీవి విశ్వంభర, అజిత్ విడాయుమర్చి, మోహన్ లాల్ రామ్ లో నటిస్తున్న త్రిష ఈ సినిమాలన్నింటికీ ఒకేలా పారితోషికాన్ని తీసుకోవడం లేదు. బడ్జెట్, కాల్షీట్స్ ను బట్టి రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుంది అమ్మడు.
థగ్ లైఫ్ కోసం ఎక్కువ డేట్స్ అవసరమున్నందున భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని టాక్. విశ్వంభరలో ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా టాలీవుడ్ హయ్యెస్ట్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా విజయ్ గోట్ సినిమాలో గెస్ట్ రోల్ తో పాటూ ఓ సాంగ్ చేస్తుందని సమాచారం. మలయాళంలో నివిన్ పౌలీతో ఐడెంటిటీ సినిమా చేస్తుంది. త్రిష ఇవాళ ఇంత బిజీగా ఉందంటే దానికి కారణం పొన్నియన్ సెల్వన్ సినిమానే.