ASBL NSL Infratech

ఈ వారం విడుదలైన తెలుగు చిత్రాలు ఎలా వున్నాయంటే?

ఈ వారం విడుదలైన తెలుగు చిత్రాలు ఎలా వున్నాయంటే?

'రుద్రంగి' చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.5/5
'ఓ సాథియా'  చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.5/5
'రంగబలి' చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5
'7:11పిఎమ్' చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5
'సర్కిల్'  చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5
‘భాగ్ సాలే’ చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2/5

ఈ రోజు  (07.07.2023) ఒకే సారి విడుదలైన తెలుగు చిత్రాలు ఆరు వాటిలో ఏ చిత్రం ఏ విధంగా ఉందొ? ఏ రేటింగ్ సాధించుకుందో? ఆరు చిత్రాలలో థియేటర్లో నిలబడే చిత్రాలు ఏవో క్లుప్తంగా చూద్దాం.  

1. నాగ శౌర్య హీరోగా, పవన్ బాసంశెట్టి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగ బలి. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. నాగ శౌర్య చేసిన  ఈ లోకల్ యాక్షన్ డ్రామాలో మెయిన్ పాయింట్, కొన్ని కామెడీ సన్నివేశాలు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్స్‌ ఆకట్టుకున్నాయి. అయితే, కథాకథనాలు ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, కొన్ని చోట్ల ప్లే స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
'రంగబలి' చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5

2. ఆర్యాన్ గౌరా హీరోగా ఓ సాథియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ సినిమాని నిర్మించారు. దివ్యా భావన దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా ఈ రోజు రిలీజ్ అయ్యింది.  ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా.. లవర్స్ కి యూత్ కి కనెక్ట్ అవుతుంది.
'ఓ సాథియా' చిత్రానికి తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.5/5

3. సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత  నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోదు. సినిమాలో డెప్త్ లేదు, సరైన ఎమోషన్స్ లేని బోరింగ్ లవ్ ట్రాక్‌లతో నిండి ఉంది. కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ చూపించిన విధానం ఆకట్టుకోదు. సాయి రోనక్ నటన, కొన్ని సన్నివేశాలు మినహా ఈ చిత్రం మొత్తంగా నిరాశపరిచింది.
'సర్కిల్' చిత్రానికి తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5

4. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలారాతో గుర్తింపు పొందిన కీరవాణి తనయుడిగా కాకుండా తన మార్క్‌ చూపించాడు శ్రీ సింహ కోడూరి, ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’తో ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ‘భాగ్ సాలే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘భాగ్ సాలే’ కథ, కథనాలు కొత్తగా ఏమీ ఉండవు. పాత కథే అయినా, స్క్రీన్ ప్లేలో ఎలాంటి చమక్కులు లేకపోయినా మేకింగ్, టేకింగ్ కొత్తగా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నీరసంగా సాగే కథనం, ఎక్కడా కొత్తదనం లేని సీన్లతో బోర్ కొట్టిస్తే అది సహనానికి పరీక్షలానే ఉంటుంది. ‘భాగ్ సాలే’ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో హీరో పరిగెత్తినట్టుగా.. కథ, కథనాలు పరిగెత్తవు. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ కాలేదనిపిస్తుంది. నిరాశ పరిచిన చిత్రం గా నిలబడింది.
‘భాగ్ సాలే’ చిత్రానికి తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2/5

5. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో కాస్త అటెన్షన్ ని పట్టుకునే విధంగా డీసెంట్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన సై ఫై థ్రిల్లర్ డ్రామా “7:11పిఎమ్” కూడా ఒకటి. ఈ చిత్రం 1999 లో సెట్ చేయబడింది ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “7:11పిఎమ్” చిత్రం రొటీన్ కాన్సెప్ట్ ని కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది లాజికల్ ఎర్రర్స్ తో అయితే సక్సెస్ కాలేదు. చెప్పుకోతగ్గ అంశాలు నిర్మాణ విలువలు బాగుంటాయి, చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే మంచి విజువల్స్ ని అయితే మేకర్స్ చూపించడం విశేషం. మినహా ఈ సై ఫై డ్రామా అయితే అంతగా ఆకట్టుకోదు.
“7:11పిఎమ్” చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5

6. ప్రముఖ సీనియర్ విలక్షణ నటుడు  జగపతిబాబు ప్రధాన పాత్రలో మమతా మోహన్ దాస్, విమలా రామన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “రుద్రంగి”. మరి ఈ చిత్రానికి బాలయ్య గెస్ట్ గా వచ్చి ప్రమోట్ చేసిన ఈ చిత్రం కూడా ఈ రోజే విడుదలైంది. మొత్తంగా చూసినట్టు అయితే 1940వ దశకంలో సెట్ చేయబడిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ “రుద్రంగి” లో జగపతి బాబు వన్ మాన్ షో అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని అంశాలు వరకు ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంటుంది కానీ సెకండాఫ్ ని, పలు ఎమోషన్స్ ని కీలక బ్లాక్ లు బాగా డిజైన్ చేసి ఉంటే సినిమా ఆకట్టుకునేది. ఈ ఆరు చిత్రాలలో అయితే ఈ వారాంతానికి కొంతమేర థ్రిల్ పొందే చిత్రం గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
“రుద్రంగి” చిత్రానికి  తెలుగు టైమ్స్.నెట్ ఇస్తున్న రేటింగ్ : 2.5/5

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :