ఈ ఉగాదికి అప్డేట్ల మీద అప్డేట్లు

మరో రెండ్రోజుల్లో తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది. ఎంతో మంగళకరంగా భావించే ఈ పండుగని మామూలు జనాలతో పాటూ, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో సెంటిమెంట్‌గా ఫాలో అవుతాయి. కాబట్టే ఉగాది నాడు కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టైటిల్స్, అప్డేట్స్, షూటింగ్ ఓపెనింగ్స్, పూజా కార్యక్రమాలు ఇలా చాలా ఉంటుంటాయి.
ఈ ఏడాది ఉగాదికి టాలీవుడ్ లో పెద్ద సందడే ఉండనుంది. ఉగాది రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటుగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగమార్తాండ కూడా ఆ రోజే రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా ఇంకో రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఉగాది నాడు విడుదల కానున్నాయి.
సినిమా రిలీజ్ లతో పాటుగా ఉగాది రోజే మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదోక అప్డేట్ ఇవ్వాలని బలంగా ప్రయత్నం చేస్తున్న టీమ్, ఆ రోజుకు టైటిల్ విషయంలో ఇంకా డెసిషన్ తీసుకోకపోతే మహేష్ ఉన్న కొత్త పోస్టర్‌ను అయినా రిలీజ్ చేస్తారని టాక్. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్‌ను ఆ రోజే రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏజెంట్ రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చే ఛాన్సుంది. చిరంజీవి భోళా శంకర్ నుంచి చిత్ర యూనిట్ ఏదో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది కాకుండా నాగార్జున- ప్రసన్న కుమార్ బెజవాడ కాంబోలో రానున్న విలేజ్ డ్రామాకు సంబంధించిన క్లారిటీని ఉగాది రోజు నిర్మాతలు ఇవ్వానున్నారట.
వీటితో పాటుగా తారక్- కొరటాల మూవీ నుంచి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేస్తారంటున్నారు. వీటిలో చాలా అప్డేట్స్ వర్కవుట్ అయ్యేలానే ఉన్నాయి. ఎలాగూ రామ్ చరణ్ బర్త్‌డే టీజర్ రిలీజ్ చేస్తారంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన డేట్, టైమ్ కూడా ఉగాది రోజు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఉగాది ఆడియన్స్‌కు అప్డేట్స్ తో ఊపిరి ఆడనీయకుండా చేయడానికి రెడీ అవబోతుందన్నమాట.