ASBL NSL Infratech

టాలీవుడ్‌కు పెద్దగా అచ్చిరాని 2023

టాలీవుడ్‌కు పెద్దగా అచ్చిరాని 2023

2023లో టాలీవుడ్‌కు మిక్స్డ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. భారీ విజయాలతో పాటు అదే స్థాయిలో డిజాస్టర్లు కూడా పలకరించాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి. ప్రేక్షకాదరణ పొందిన  చిత్రాల సమీక్షాపై  ఓ లుక్కేద్దాం.

2023 ఏడాది ఆరంభం జనవరిలో బాలకృష్ణ  వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం, హంట్‌, వాలంటైన్స్‌ నైట్‌ సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఈ రెండు సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద దుమ్ము రేపాయి. ఫిబ్రవరి 2023లో భారీ బడ్జెట్‌ తో తీసిన సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’, రైటర్‌ పద్మభూషణ్‌, బుట్ట బొమ్మ, నందమూరి  కళ్యాణ్‌ రామ్‌ ‘ఆమిగోస్‌’ ధనుష్‌ ‘సర్‌’, వినరో భాగ్యము విష్ణు కథ, శ్రీదేవి శోభన్‌ బాబు, మిస్టర్‌ కింగ్‌, చిత్రాలు విడుదల అయ్యాయి. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘ఆమిగోస్‌’ విడుదలకు ముందుగా మంచి క్రెజ్‌ వచ్చినా విడుదల తరువాత విఫలమైంది. ఈ నెలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ అందించిన ‘సర్‌’ చిత్రం తప్పా మిగతా అన్ని సినిమాలు నిరాశ పరిచాయి.

మార్చ్‌ 2023లో దిల్‌ రాజు అందించిన బలగం, యస్వీ కృష్ణా రెడ్డి అందించిన ఆర్గానిక్‌ మామ, హైబ్రిడ్‌ అల్లుడు, సియస్‌ఐ సనాతన్‌, పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, దాస్‌ కా ధమ్కీ, కృష్ణ వంశి రంగమార్తాండ, నాని దసరా చిత్రాలు విడుదల అయ్యాయి. మార్చ్‌ 3వ తేదీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం బలగం చిత్రం పల్లెవాసు లను అమితంగా ఆకట్టుకుంది. అటు అవార్డులు, ఇటు రివార్డులు అందుకున్న ఈ చిన్న బడ్జెట్‌ సినిమా పెద్ద సినిమా రేంజ్‌లో ఆడిరది. ఇక కృష్ణవంశీ అందించిన రంగ మార్తాండకు మంచి ప్రశంసలు లభించాయి కానీ కమర్షియల్‌గా ఫ్లాప్‌ మూవీగా నిలిచింది. నాని దసరా కమర్షియల్‌గా పాపులర్‌ మూవీగా నిలబడిరది. విశ్వక్‌ సేన్‌ దర్శక నిర్మాతగా హిందీ, తెలుగులో వచ్చిన దాస్‌ కా ధమ్కీ ప్లాప్‌గా, ఈ చిత్రంతో పాటు ఆర్గానిక్‌ మామ, హైబ్రిడ్‌ అల్లుడు, సియస్‌ఐ సనాతన్‌, పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, కనపడకుండా పోయాయి.

ఏప్రిల్‌ 2023లో  రవితేజ రావణాసుర, మీటర్‌, గుణశేఖర్‌ శాకుంతలం, 10 రూపీస్‌, హలో మీరా, టూ సోల్స్‌, సాయి ధరమ్‌ తేజ్‌  విరూపాక్ష, అఖిల్‌ అక్కినేని  ఏజెంట్‌, రా రా పెనిమిటి, విద్యార్థి చిత్రాలు విడుదల అయ్యాయి. సమంతతో నిర్మాత దిల్‌ రాజు, గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ప్రభావంను కనబర్చలేదు. సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్ష అనే మిస్టికల్‌ థ్రిల్లర్‌తో తిరిగి వచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన సాంకేతిక విలువలతో థియేట్రికల్‌ అనుభవానితో ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. రవితేజ  రావణాసుర అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ ‘ఏజెంట్‌’ రొటీన్‌ సినిమాగా అపజయం పొందింది.

మే 2023లో ఈ సమ్మర్‌లో మే 12న ఒకేసారి 8 సినిమాల వరకు రిలీజ్‌ అయ్యాయి. గోపీచంద్‌ రామబాణం, అల్లరి నరేష్‌ ఉగ్రం, అరంగ్రేటం, భువన విజయం, కథ వెనుక కథ, నాగ చైతన్య కస్టడీ, కళ్యాణమస్తు, టీ బ్రేక్‌, ది స్టోరీ అఫ్‌ ఏ బ్యూటిఫుల్‌ గర్ల్‌, అన్ని మంచి శకునంలే, హసీనా, మళ్ళీ పెళ్లి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  ‘భూ’ చిత్రాలు విడు దలయ్యాయి. ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్‌కి మంచి పేరు వచ్చింది కానీ... చిత్రం సక్సెస్‌ కాలేదు. రామ బాణం చిత్రం గోపీచంద్‌ లిస్టులో మరో ప్లాప్‌. నాగ చైతన్య కస్టడీ యావరేజ్‌, ఇక మిగతా సినిమాలన్నీ ఉప్పుకు ఊరగాయకు లేకుండాపోయాయి.

జూన్‌ 2023లో అహింస, చక్రవ్యూహం ది ట్రాప్‌, నేను స్టూడెంట్‌ సర్‌, మేం ఫేమస్‌, పరేషాన్‌, అనంతా, ఇంటింటి రామాయణం, అంస్టాపబుల్‌, విమానం, ఆదిపురుష్‌, కర్ణ, స్పై, సామ జవరా గమన, చిత్రాలు విడుదల అయ్యాయి. ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో వచ్చిన కలెక్షన్స్‌ ను చూస్తే కచ్చితంగా డిజాస్టర్‌ అనడంలో సందేహం లేదు. నిర్మాత డి  సురేష్‌ బాబు ద్వీతీయ పుత్రుడు దగ్గుబాటి అభిరామ్‌ను పరిచయం చేస్తూ...  డైరెక్టర్‌ తేజతో జెమినీ కిరణ్‌ నిర్మించిన చిత్రం అహింస, మంచి అంచనాలతో విడుదలయినా ఈ చిత్రం ఏ మాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేక పోయిం ది. శ్రీవిష్ణు హీరోగా అనిల్‌ సుంకర నిమించిన  ‘సామ జవరా గమన’, కమర్షియల్‌ హిట్‌ చిత్రంగా నిలబడిరది. విమానం చిత్రానికి ప్రశంసలు లభించాయి.  ఇక నిఖిల్‌  ‘స్పై’, డిజాస్టర్‌ అనడంలో సందేహం లేదు.

జులై 2023లో 7:11పియం, బాగ్‌ సాలే,సర్కిల్‌, లిల్లీ, మోహన్‌ కృష్ణ గ్యాంగ్‌ లీడర్‌, ఓ సాథియా, రంగబలి, రుద్రంగి, బేబీ,  రివెంజ్‌, హిడిరబా, అలా ఇలా ఎలా, డిటెక్టివ్‌ కార్తీక్‌, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, హేర్‌ - చాప్టర్‌ 1, నాతో నేను, బ్రో, ఒక్క రోజు 48 హౌర్స్‌, సాక్షి, స్లండాగ్‌ హస్బెండ్‌ మొదలైన చిత్రాలు విడుదలయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో మలయాళ చిత్ర రీమేక్‌  ‘బ్రో’ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ దానికి  తగ్గట్లుగా వసూళ్లతో పాటు టాక్‌లో కూడా  పూర్తిగా విఫలం అయ్యింది. ఈ నెలలో విడుదలైన  బేబీ సెన్సషనల్‌ హిట్‌ అయ్యింది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ హిట్‌. మిగతా సినిమాలన్నీ పేరు లేకుండా పోయాయి.

ఆగష్టు 2023లో దిల్‌ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌, మిస్టేక్‌, రాజుగారి కోడి పలావ్‌, భోళా శంకర్‌, ఉస్తాద్‌, జిలేబి, మదిలో మది, మిస్టర్‌ ప్రెగ్నెంట్‌, ప్రేమ్‌ కుమార్‌, బెదురులంక 2012, దక్ష, ఏం చేస్తున్నావ్‌?, గాండీవధారి అర్జున్‌, నేనేనా?, రెంట్‌ నాట్‌ ఫర్‌ సేల్‌ చిత్రాలు విడుదలయ్యాయి. జులై  నెలలో వున్న ఫలితాలే ఆగష్టులో కూడా కంటిన్యూ అయ్యాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మలయాళ రీ మేక్‌ భోళాశంకర్‌ భారీ అంచనాలతో విడుదలై అపజయం పాలైంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహెల్‌ నటించిన  మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ ఓ డిఫరెంట్‌ మూవీ గా పేరు తెచ్చుకుంది. కార్తికేయ ‘బెదురులంక 2012,’ వరుణ్‌ తేజ్‌ గాండీవధారి అర్జున్‌, టైటిల్స్‌ కి పాపులారిటీ వచ్చినా చిత్రాలు నిలబడలేదు.

సెప్టెంబర్‌ 2023లో ఖుషి, ప్రేమదేశపు యువరాణి, మిస్‌ శెట్టి - మిస్టర్‌ పోలిశెట్టి, గోవిందా భజ గోవిందా, తురుం ఖానులు, ఛాంగురే బంగారు రాజా, రామన్న యూత్‌, సోదర సోదరమణులారా!, అష్ట దిగ్బంధనం, చీటర్‌, మట్టి కథ, నచ్చినవాడు, ఓయ్‌ ఇడియట్‌, రుద్రంకోట, వారెవ్వ జాతగాళ్ళు, స్కంద - ఎటాక్‌, పెద్దకాపు 1 మొదలైన చిత్రాలు మనముందుకొచ్చాయి. బోయపాటి శ్రీను - రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన స్కంద అపజయం పాలైంది. విజయ్‌ దేవరకొండ సమంత కాంబినేషన్‌లో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. చాలా కాలం తరువాత మిస్‌ శెట్టి - మిస్టర్‌ పోలిశెటి తో స్క్రీన్‌ పైకి వచ్చిన అనుష్క నవీన్‌ పోలిశెట్టికి అదృష్టం కలిసి రాలేదు. ఇక మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.

అక్టోబర్‌ 2023లో జిటిఏ (గన్స్‌ ట్రాన్స్‌ ఏక్షన్‌), మామ మచ్చింద్ర, మాడ్‌, మంత్‌ అఫ్‌ మధు, నేనే సరోజ, రూల్స్‌ రంజన్‌, ఏందిరా ఈ పంచాయతీ, తంత్రిరం, భగవంత్‌ కేసరి, టైగర్‌ నాగేశ్వర్‌రావు చిత్రాలు విడుదలైయ్యాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘‘భగవంత్‌ కేసరి’’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి అనే రెండు సూపర్‌హిట్‌లను అందించిన తర్వాత భగవంత్‌ కేసరితో హాట్ట్రిక్‌ హిట్‌ అందుకున్నారు బాలయ్య. మూస డ్యూయెట్స్‌ లవ్‌ సాంగ్స్‌ లాంటివి లేకుండా మంచి సందేశాత్మకంగా ఈ చిత్రం పేరుతెచ్చుకుంది. స్టువర్ట్‌పురం గజదొంగ బయోపిక్‌  రవితేజ టైగర్‌ నాగేశ్వర్‌రావు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన యూత్‌ అండ్‌ రొమాంటిక్‌ మూవీ మాడ్‌ మంచి విజయం సాధించింది.

నవంబర్‌ 2023లో వచ్చిన చిత్రాలు అనుకున్న వన్నీ జరుగవు కొన్ని, ద్రోహి - ది  క్రిమినల్‌, కీడా కోలా, కృష్ణ ఘట్టం, మా ఊరి పొలిమేర 2, మిడ్‌ నైట్‌ కిల్లర్స్‌, నరకాసుర, ఒకసారి ప్రేమించాక..., ప్లాట్‌, విధి, అలా నిన్ను చేరి, అన్వేషి, జనం, మంగళవారం, మై నేమ్‌ ఈజ్‌ శృతి, స్పార్క్‌ ఎల్‌ ఐ ఎఫ్‌ ఈ, ఏ చోట నీవున్నా!, ఆదికేశవ, కోట బొమ్మాళి   పిఎస్‌, మాధవే మధుసూధనా!, పర్ప్యూమ్‌, ది ట్రయిల్‌ ఈ నెలలో రోజుకొక్క సినిమా అంటే 30 సినిమాల వరకు విడుదలయ్యాయి. మంగళవారం, పిఎస్‌, కీడా కోలా చిత్రాలు యావరేజ్‌ టాక్‌తో ప్రదర్శితమయ్యాయి.  ‘కోటబొమ్మాళి పీఎస్‌’.  మా వూరి పొలిమేరా 2 హిట్‌ సినిమాగా నిలిచింది.

డిసెంబర్‌ 2023 ప్రస్తుతం జరుగుతున్న నెల. ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు... అధర్వ, కాలింగ్‌ సహస్ర, పల్లె గూటికి పండగొ చ్చింది, ఉపేంద్ర గాడి అడ్డా, బ్రితే, హాయ్‌ నాన్న, ఎక్సట్రా ఆర్డినరీ మాన్‌, పిండం, కలశ, చే గువేరా, జోరుగా... శాంతల,  హుషారుగా.. సున్నితమైన భావోద్వేగ కథతో  ‘ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా’గా వచ్చిన హాయ్‌ నాన్న చిత్రం అటు ప్రేక్షకు లను, ఇటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఓ సగటు తండ్రిగా నాని చాలా బాగా నటించాడు. నితిన్‌ ‘ఎక్సట్రా ఆర్డినరీ మాన్‌’ వారం సినిమా అయ్యింది. ఇక డిసెంబర్‌లోనే విడుదల కాబోయే చిత్రాలు  ఏ ఏ 21, ఇంకెన్నాళ్లు? ఈ క్రిస్త్మస్‌ కానుకగా ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌, హోంబలే ఫిలిమ్స్‌ ‘సలార్‌’ వరల్డ్‌  ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. దీంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఆకాశాన్నంటింది. 2023 సంవత్సరానికి గుడ్‌ బై చెపుతూ ప్రభాస్‌కు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ప్రేక్షకులు అందించాలని తెలుగు టైమ్స్‌ ఆకాంక్షితోంది.

- రాంబాబు వర్మ లంక

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :