టీటీడీ చరిత్రలో తొలిసారి.. రికార్డు స్థాయిలో

వైకుంఠ ఏకాదశి పర్వదినాన పెద్ద ఎత్తున భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజులోనే రూ.7.68 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 23న లభించిన రూ.6.31 కోట్లే ఇప్పటి వరకు అత్యధిక ఆదాయం. తాజాగా వైకుంఠ ఏకాదశి రోజున వచ్చిన మొత్తం దాన్ని అధిగమించినట్లయింది.
Tags :