ASBL NSL Infratech

రివ్యూ : 'టిల్లు స్క్వేర్' ఆధ్యంతం వినోదమే వినోదం!

రివ్యూ : 'టిల్లు స్క్వేర్' ఆధ్యంతం వినోదమే వినోదం!

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్,
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, నేహా శర్మ, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్: నవీన్ నూలి
సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య
దర్శకుడు: మల్లిక్ రామ్
విడుదల తేదీ : 29.03.2024
నిడివి : 2 ఘంటల 16 నిమిషములు

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లుతో యూత్ ఫుల్ క్రేజీ తో  ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు.  టిల్లు గాడి వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అంతా కూడా కుర్రాళ్లకు బాగానే ఎక్కేసింది. ఓ క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఇంతలా యూత్‌కు కనెక్ట్ కావడం చాలా అరుదు. అందుకే ఆ టిల్లు గాడి చుట్టూ మరో కథ తో  సీక్వెల్ లా వచ్చిన అవైటెడ్ చిత్రమే “టిల్లు స్క్వేర్”.  ఇక ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ ఆమె  కనిపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోయారు. మరి నిన్ననే విడుదల అయిన ఈ చిత్రం రిజల్ట్ తో  “టిల్లు క్యూబ్ ” కూడా తెరకెక్కుతుందో  సిద్దు జొన్నలగడ్డ చేసిన మరో ప్రయత్నం వర్కౌట్ అయిందా? లేదా? అన్నది సమీక్షలో చూద్దాం.

కథ :

ఇక కథలోకి వస్తే.....  పాత దెబ్బ నుంచి కోలుకుని టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి టిల్లు ఈవెంట్స్ స్టార్ట్ చేసి వెడ్డింగ్ ప్లానింగ్ లు తన డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. అలా ఓ రోజు తన లైఫ్ లోకి లిల్లీ జోసెఫ్(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. ఒక పబ్‌లో అలా పరిచయమై.. ఇలా  మాయం అవుతుంది. మళ్లీ ఒక నెల తరువాత కనిపించి గర్భవతి అని చెప్తుంది. అప్పటికే లిల్లీ కోసం టిల్లు సైతం వెతుకుతుంటాడు. అలా సడెన్‌గా కనిపించి ప్రెగ్నంట్ అని చెప్పడంతో షాక్ అవుతాడు. చివరికి పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. మరి అక్కడ నుంచి మళ్లీ టిల్లు గేర్ మారుస్తాడు. ఆ తర్వాత మళ్లీ తన బర్త్ డే స్పెషల్ గా ఫ్రెష్ ప్రాబ్లమ్ తో లిల్లీ తనని సాయం కోరుతుంది. మరి ఆల్రెడీ రాధికా (నేహా శెట్టి) వల్ల దెబ్బ తిన్న తాను ఏం చేస్తాడు? వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? మళ్లీ రాధికా ఉందా లేదా? అసలు చివరికి ఈ క్రేజీ రైడ్ ఎలా ఎండ్ అయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లు గా షైన్ అయ్యాడు. ఇల్లాజికల్ సీన్లు ఎన్ని కనిపించినా కూడా టిల్లు గాడు మ్యాజిక్ చేసాడు. తన మ్యానరిజం, యాక్టింగ్, మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సినిమాలోని లోపాలన్నీ కూడా ఒకా  టిల్లు పాత్ర కప్పి పుచ్చుతుంది. స్పెషల్ ఫోర్స్, ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అంటూ ఇలా పెద్ద పెద్ద పదాలు వాడారు. కానీ అవేమి అంతగా ఇంపాక్ట్‌గా అనిపించదు. ఎందుకంటే టిల్లు గాడి ప్రపంచం మన లోకల్‌గానే చూస్తాం. ఇలాంటి లోకల్ క్యారెక్టర్ ప్రపంచంలోకి ఆ పాత్రలన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ డాన్ ఏంటి ఇంత సిల్లీగా, సింపుల్‌గా ఉన్నాడనిపిస్తుంది. తన మార్క్ టైమింగ్ కామెడీతో సీన్స్ ని హిలేరియోస్ గా పండించాడు అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో మంచి హ్యాండ్సమ్ లుక్స్ తో మంచి నటనతో తాను ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తాడు. టిల్లు పాత్రతో పాటు అనుపమ చేసిన లిల్లీ పాత్రను సైతం రైటర్స్, డైరెక్టర్లు బాగానే రాసుకున్నారు. ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఈ మూవీకి హైలెట్. మనకు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలని అనే కొన్ని పరిమితులు, సూత్రాలుంటాయ్ కదా. కానీ చివర్లో ఆమె పాత్రలోని అసలు కోణాన్ని చూపించి జస్టిఫై చేస్తారు. తన గ్లామ్ షో ఒకెత్తు అయితే తన పెర్ఫామెన్స్ కూడా సినిమాలో అదరగొడుతుంది.  అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ పలు కామెడీ సీన్స్ తో యూత్ కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకునేవారికి ట్రీట్ ఇస్తారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో రాధికా గా నేహా శెట్టి ఎంట్రీ కూడా బాగుంటుంది. ఇక వీటితో పాటుగా సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ కూడా మామూలుగా ఉండదు. ఇంకా మెయిన్ లీడ్ సహా మురళీ శర్మ తన రోల్ కి న్యాయం చేకూర్చారు ఇంకా నటుడు మురళీధర్ గౌడ్ నటన ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. ఇక వీరితో పాటుగా మిగతా తారాగణం అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే తను ఈ సినిమాకి ఇంప్రెసివ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. తనతో పాటుగా సిద్ధూ కూడా ఈ చిత్రానికి రచనలో తన పనితనం చూపించాడు. నరేషన్ ని మల్లిక్ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం బాగుంది. స్టోరీ పరంగా కొన్ని అంశాలు రొటీన్ గానే ఉన్నాయి కానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాత్రం తాను పుష్కలంగా అందించాడు. అలాగే టెక్నికల్ టీం లో రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సాంగ్స్,  భీమ్స్ నేపథ్య గీతంలు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు.

విశ్లేషణ :

టిల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే.. డీజే టిల్లు తో పోలిస్తే  కొత్తగా వెతుక్కోవడానికి ఏమీ లేని రుచికరమైన పాత చింతకాయ పచ్చడి. కానీ  పాతవాసనలు కొట్టొచ్చిన.. దానిని వదలిపెట్టకుండా ఉండేలా వండి వార్చి వడ్డించారు.  డీజే టిల్లు చూసినవారు  ఎన్ని అంచనాలు పెట్టుకొని వెళ్లినా  వాటన్నింటిని టిల్లు స్క్వేర్  సంతృప్తి పరుస్తుంది. సినిమా మొదలైన తొలి ఫ్రేమ్ నుంచి చివర ఫ్రేమ్ వరకు ఫన్‌తో నవ్వుతూనే ఉంటాం. ఓవరాల్‌గా టిల్లు స్క్వేర్ ఫన్, అండ్ లాఫింగ్ రైడ్స్. ఫుల్ ఎంజాయ్ ఆన్ బిగ్ స్క్రీన్.. డోంట్ మిస్ ఇట్ ఫన్ లవర్స్. ఆధ్యంతం వినోదమే వినోదం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :