ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ వచ్చేస్తుంది
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను దక్కించుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక ఇప్పుడు పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉంది.
పుష్ప2తో పాటూ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో రష్మిక తో పాటూ పలు పాపులర్ నటులు కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానున్నట్లు డైరెక్టర్ రాహుల్ ఎక్స్ లో తెలిపాడు.
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అప్డేట్ ఇవ్వమని ఒకతను రాహుల్ ను రిక్వెస్ట్ చేయగా, రాహుల్ దానికి స్పందిస్తూ ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ ను రష్మిక బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో రష్మిక సరసన హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.