తెలుగు జ్యోతి సంక్రాతి కథలు, కవితల పోటీలు

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో 2024 సంక్రాంతి పోటీలు నిర్వహిస్తున్నారు. కథలు, కథానికలు, పద్యాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుగు కళా సమితి వెల్లడించింది. పెద్దల కథల పోటీల్లో మొదటి బహుమతి వంద డాలర్లు, రెండో బహుమతి 50 డాలర్లు అందజేస్తారు. కవితల పోటీల్లో మొదటి బహుమతిగా 50 డాలర్లు, రెండో బహుమతిగా 25 డాలర్లు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక పిల్లల విభాగంలో కథలు, కవితలు, ముగ్గుల మూడు పోటీల్లో తొలి బహుమతిగా 50 డాలర్లు, రెండో బహుమతిగా 25 డాలర్లు అందిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వాళ్లు.. నవంబరు 30వ తేదీలోపు తమ రచనలు, ముగ్గులను tjarticles@tfas.net కు పంపాలని నిర్వాహకులు కోరారు. పీడీఎఫ్ ఫైల్స్ కాకుండా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్స్ రూపంలో మాత్రమే వీటిని పంపాలని చెప్పారు. అలాగే ఏవైనా యూనికోడ్ ఫాంట్స్‌లో మాత్రమే రచనలు పంపాలి. సింగిల్ స్పేస్‌లో 8 పేజీలలోపు మాత్రమే రచనలు ఉండాలి. గతంలో తెలుగు జ్యోతికి పంపిన రచనలను మళ్లీ పరిగణనలోకి తీసుకోవడం జరగదు. ముగ్గుల పోటీలు కేవలం 18 ఏళ్ల లోపు యువతీ యువకులకు మాత్రమే. రచనలతోపాటు పేరు, ఊరు, చిరునామా, ఈమెయిల్ అడ్రస్, వ్యక్తిగత పరిచయంతోపాటుగా సదరు రచన సొంతమేనని, ఎక్కడా ప్రచురించలేదని ధ్రువీకరణను కూడా జతపరచాలి. తెలుగు జ్యోతి సంపాదక వర్గ సభ్యులు, న్యూజెర్సీ తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఈ బహుమతులకు అర్హులు కాదు. అలాగే కేవలం పోటీలకే కాకుండా సాధారణ ప్రచురణ కోసం కూడా పిల్లల చేత తెలుగు, లేదా ఇంగ్లీషులో కథలు, మరేవైనా కబుర్లు రాయించి పంపాలని కూడా తెలుగు కళా సమితి కోరుతోంది.






