Radha Spaces ASBL

నూజెర్సీలో ఉల్లాసంగా తెలుగు కళా సమితి వేసవి వనభోజనాలు 

నూజెర్సీలో ఉల్లాసంగా తెలుగు కళా సమితి వేసవి వనభోజనాలు 

న్యూ జెర్సీ తెలుగు కళా సమితి వేసవి వనభోజనాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం, జూలై 31వ తేదిన నేడె వల్లే పట్టణంలోని బర్న్స్‌ పార్క్‌ లో చక్కని ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పైగా ప్రవాసాంధ్రులు, యువతీ, యువకులు, మహిళలు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు శ్రీ మధు రాచకుళ్ళ వన భోజనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికి, ఈ పిక్నిక్‌ దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా మనస్సును ఉంచాలని, అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల ఒత్తిళ్ళు, మనోవేదనలు తీరతాయని, సభ్యుల మధ్య స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయని, పరస్పరం ఆహార పదార్ధాలు పంచుకుతినడంవల్ల భిన్న రుచులు అనుభూతికి వస్తాయని తెలియచేశారు. తెలుగుకళాసమితి కార్యవర్గంలోని సభ్యులందరూ సమిష్టిగా పని చేయటం వల్లనే ఇంతటి కార్యక్రమం నిర్వహించగలిగామని అన్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అంతర్జాతీయ పేరడీ రివర్స్‌ గేర్‌ గాయకుడు గురుస్వామి పాటలను రివర్స్‌లో పాడి, తనదైన శైలిలో హాస్యాన్ని, మిమిక్రీని మేళవించి అందర్నీ అలరించారు. అనేక సినిమా పాటలకు పేరడి కట్టి అదే పాటని చాల రకాలుగా వినిపించారు. ‘నెల్లూరి నెరజాణ... కుంకుమల్లే మారిపోనా’ పాటను హరిదాసు, బుర్రకథ, ఉగ్గుకథ, తెలుగు పద్యం రూపంలో పాడి ప్రాచీన నవీన సంగీత మాధ్యమాలను వివరించి వినిపించడంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. కమ్యూనిటీ కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి పులిపాక ఈ హాస్యభరిత కార్యక్రమాన్ని నిర్వహించారు. రాము ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు. ప్రముఖ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ విజయ నిమ్మ, మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మానసిక, ఆ రీరక దృఢత్వాన్ని పెంపొందించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన సాధనం యోగా అని. దైనందిన జీవనంలో యోగ ను ఒక భాగంగా చేసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. తెలుగు కళా సమితి ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనూరాధ దాసరి తాను స్వయంగా ఒక పాట పాడి, అక్కడకు వచ్చిన చిన్నారులతో పాటలు పాడిరచారు. తానివేగల పెంపకం - జీవన విధానం మీద ఏర్పాటు చేసి ప్రదర్శన చిన్నపిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీదేవి కామరసు నిర్వహించిన మ్యూజిక్‌ ఈ బాలు కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొని రక్తి కట్టించారు.

శ్రీ వెంకట్‌ శ్రీరామ్‌, పూర్వపు తెలుగు కళా సమితి అధ్యక్షులు మరియు ప్రతినిధులు శ్రీమతి భారతి-మూర్తి భావరాజు దంపతులు, శ్రీ రాజారావు బండారు, శ్రీ హరి ఎప్పునొష్మ శ్రీ సత్యం ప్రకొండ, శ్రీ దాము గేదెల, శ్రీ ఆనంద్‌ పాలూరి, శ్రీమతి మంజు భార్గవ-మోహన్‌ దంపతులు, శ్రీ సుధాకర్‌ ఉప్పల, శ్రీమతి దణా శ్యామల-రావు దంపతులు, శ్రీ సత్యనారాయణ మూర్తి తమ్మిరెడ్డి కౌంటీ కమిషనర్‌ స్మిత్‌, శ్రీమతి శాంతి నర్రా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కష్టపడిన వాలంటీర్స్‌ కు, స్పాన్సర్లు న్యూయార్క్‌ లైఫ్‌, శ్రీకృష్ణ రాణి, శ్రీ సత్యం శ్రీకొండ, శ్రీమతి ప్రతిభ ఇసుకపల్లి, శ్రీ రవి ఇల్లెందుల, సెయింట్‌ మార్టినస్‌ మెడికల్‌ యూనివర్సిటీకి తెలుగు కళా సమితి కార్యవర్గం ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేసింది. వేసవి కాలం అయినప్పటికీ ఎత్తైన చెట్ల మధ్య, స్వచ్చమైన గాలిని, అచ్చమైన పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, చిరకాల మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటూ తెలుగు కళా సమితి సభ్యులు సందడి చేశారు. ఘుమఘుమలాడే తెలుగు సాంప్రదాయ విందు భోజనాలతో వన భోజన కార్యక్రమం ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ వన భోజనాలకు హాజులైన కొందరు తమ తమ ఇళ్లలో తయారు చేసుకొని వచ్చిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఇతరులకు కూడా పంచిపెట్టి, ఇతరుల పదార్థాలు తాము ఆస్వాదించి తినడంతో పిక్నిక్‌ మొత్తం రసవత్తరంగా మారింది.  

Click here for Event Gallery

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :